ఒకప్పుడు హీరోయిజాన్ని పండించే వాన్నే.. హీరో అనేవారు. కానీ ఇప్పుడు విలనిజాన్ని పండించే వాన్నే హీరో అంటున్నారు. క్రూరంగా కర్కషంగా ఉండే క్యారెక్టరే హీరో అయిపోయాడు. సినిమా చూస్తున్న వారిని నెగెటివ్ షేడ్స్ తో.. ఒళ్లు జలదరించేలా చేస్తున్నారు. రోమాలు నిక్కబొడిచేంత యాక్షన్ పారిస్తున్నారు.