News

cow cess, Himachal Budget: మద్యం అమ్మకాలపై ఆవు పన్ను కట్టాల్సిందే.. మందుబాబులకు ఝలక్.. ఒక్కో సీసాపై ఎంతో తెలుసా? – cow cess of rs 10 per bottle to be imposed on liquor sale in himachal pradesh


Himachal Budget: భారత్‌లో ప్రభుత్వ ఖజానాకు మద్యం నుంచి కూడా ఆదాయం బాగానే వస్తుందన్న విషయం చాలా మందికి తెలుసు. ధరలు ఎంత పెంచినప్పటికీ మద్యం కొనడం మాత్రం తగ్గదు. అంత డిమాండ్ ఉంటుంది. కొందరికి నోట్లో మందు చుక్క పడకపోతే.. ప్రాణం విలవిల్లాడిపోతుంటుంది. ఇక మద్యం రేట్లు ఇటీవలి కాలంలో బాగానే పెరిగిపోయాయి. వీటికి తోడు.. అదనంగా పన్నులు ఉండనే ఉన్నాయి. చాలా మందికి వారు ఎంతకు కొంటున్నారు అనేది తెలుసు కానీ.. అందులో పన్నుల గురించి పెద్దగా పట్టించుకోరు. మొత్తంగా రేటెంత అనేది చూస్తుంటారు. అయితే అందులో చాలానే పన్నులుంటాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఒక అడుగు ముందుకేసి.. మద్యం అమ్మకాలపై ఆవు పన్ను వసూలు చేస్తామని ప్రకటించింది. అదేనండి కౌ సెస్ (Cow Cess). ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు శుక్రవారం ప్రకటించారు.

రాష్ట్రంలో మందుబాబులకు షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది హిమాచల్ ప్రదేశ్ సర్కార్. ఒక్కో మద్యం సీసాపై రూ.10 చొప్పున ఆవు పన్నుగా వసూలు చేస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇది ఏడాదిలో తమకు రూ.100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని చెప్పారు సీఎం సుఖ్విందర్. 2023-24 కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి.

ఇదే సమయంలో రాష్ట్రంలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా బడ్జెట్‌లో ప్రస్తావించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా హిమాచల్ ప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు సీఎం సుఖు. రూ.1000 కోట్లు పెట్టి మొత్తం 1500 డీజిల్ బస్సులను మార్చనున్నట్లు వివరించారు.

వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఈ ఆవు పన్నును చాలా రాష్ట్రాలు ఇప్పటికే వేర్వేరు ఉత్పత్తులపై విధిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా కొన్ని స్థానిక సంస్థలు కూడా ఇలా చేస్తుండటం గమనార్హం. పంజాబ్, చండీగఢ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట్ల ఈ కౌ సెస్ విధిస్తున్నారు. అయితే.. కౌ సెస్ అనేది ఆవుల సంరక్షణ కోసమేనని చెబుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. రోడ్లపై తిరిగే పశువులను పోషించేందుకే ఈ నిధులు అని అంటున్నాయి.

Gautam Adani: అదానీ గ్రూప్‌కు మళ్లీ పెద్ద ఊరట.. NSE కీలక ప్రకటన.. ఆ 3 స్టాక్స్ ఇక తగ్గేదేలే!Indian Company: హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులందరికీ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. భారత కంపెనీ కీలక ప్రకటన..Fake Jobs: Hyderabad లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. IT ఉద్యోగాల పేరిట భారీ మోసం.. ఎలా నమ్మించారో తెలుసా?

  • Read Latest Business News and Telugu News

Related Articles

Back to top button