News

Corona: పుట్టినిల్లులో కరోనా విధ్వసం.. నగర జనాభాల్లో 70 శాతం మంది బాధితులే.. ఒక తరం అంతరించిపోయే దిశగా.. | China coronavirus: 70 per cent shanghai population may have been infected with covid 19 says top Doctor


గత ఏడాది ఏప్రిల్‌లో షాంఘైలో రెండు నెలల కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో 6,00,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. అయితే ఇప్పుడు, Omicron వేరియంట్ నగరం అంతటా విస్తృతంగా వ్యాపిస్తోంది

చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఆ దేశంలో కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియ‌జేసేందుకు అనేక ర‌కాల    వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులకు ఆసుపత్రిలో చోటు లభించడం లేదు. శ్మశాన వాటికల దగ్గర భారీ  క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రజలు వీధుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి నివారణకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. చైనాలో కేసులు భారీగా పెరుగుతున్నాయని.. నగర జనాభాలో 70 శాతం మందికి కోవిడ్-19 సోకనుందని  షాంఘైలోని ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన ఓ  సీనియర్ డాక్టర్ చెప్పారు. ప్రస్తుతం తమ దేశ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.

చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం అక్కడ ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంబించారు. దీనితో కలవరపడిన ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని  వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని సడలించింది. దీని తరువాత కేసులు గణనీయంగా పెరిగాయి. అక్కడ నుంచి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కోవిడ్ మహమ్మారి విధ్వసం సృష్టిస్తుండటంతో.. లక్షలాది మంది  బాధితులుగా మారారు.

ఇదే విషయంపై రుయిజిన్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్, షాంఘై లోని కోవిడ్ నిపుణుల సలహా ప్యానెల్ సభ్యుడు చెన్ ఎర్గెన్.. స్పందిస్తూ.. నగరంలోని 25 మిలియన్ల మందికంటే ఎక్కువ మంది వ్యాధి బారిన పడి ఉండవచ్చని అంచనా వేశారు. షాంఘైలో అంటువ్యాధి వ్యాప్తి చాలా విస్తృతంగా ఉందని .. త్వరలో ఇది జనాభాలో 70 శాతానికి చేరుకోవచ్చని చెప్పారు. అంతేకాదు ఏప్రిల్, మేలో కంటే 20 నుండి 30 రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో షాంఘైలో రెండు నెలల కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో 6,00,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. అయితే ఇప్పుడు, Omicron వేరియంట్ నగరం అంతటా విస్తృతంగా వ్యాపిస్తోంది. 2023 ప్రారంభంలో సంక్రమణ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, బీజింగ్, టియాంజిన్, చాంగ్‌కింగ్ , గ్వాంగ్‌జౌ వంటి ఇతర పెద్ద నగరాల్లో.. ఇప్పటికే కరోనా కొత్త వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుందని చైనా ఆరోగ్య అధికారులు చెప్పారు. రోజుకి 1600 మంది రోగులు అత్యవసర సేవలకు తన షాంఘై ఆసుపత్రికి వస్తున్నారని చెన్ చెప్పారు. రోజుకు 100కు పైగా అంబులెన్స్‌లు వస్తున్నాయి. ఎక్కువ మంది రోగులు 65 ఏళ్లు పైబడిన వారని.. పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా… కోవిడ్-19 వేవ్ కొత్త దశలోకి ప్రవేశించిందని.. రానున్న రోజుల్లో  కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అంతేకాదు దేశం మునుపెన్నడూ లేని విధంగా ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోనుందని.. ఇక నుంచి తమ ప్రయాణం అంత తేలికైనంది కాదని జి జిన్‌పింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button