Corn Cobs,మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తింటున్నారా.. శవాలను కాల్చిన బొగ్గులతో.. – is coal from burial ground using for corn cobs, viral video in telangana creates tension
అది విన్న ఆ వ్యక్తి.. ఇలా తీసుకెళ్లటం కరెక్ట్ కాదు కాదా.. ఇలా చేయటం వల్ల సమస్యలు వస్తాయి కాదా? అసలు శ్మశానంలో నుంచి బొగ్గులు తీసుకెళ్లటం ఏంటీ..? నిన్ను ఎవరు తీసుకెళ్లమన్నారు..? అంటూ వృద్ధునిపై వరుసగా ప్రశ్నలు కురిపించగా.. వాటిని ఏం సమాధానం చెప్పలేక అతను సైలెంట్‌గా వెళ్లిపోయాడు. సర్పంచ్, అధికారులకు ఫోన్ చేస్తా అంటూ బైక్ మీద ఉన్న వ్యక్తి బెదిరించటంతో.. ఆ వృద్ధుడు భయంతో వెనక్కి వెళ్లిపోయాడు. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటన తెలంగాణలో జరగ్గా.. ఎక్కడ జరిగిందన్నది స్పష్టంగా తెలియరాలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇది చూసిన మొక్కజొన్న ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా తింటున్న కంకులను ఇలాంటి బొగ్గులతో కాలుస్తున్నారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే.. ఇది ఓ వ్యాపారమా.. లేదా ఆ వృద్ధుడే అలా చేశాడా.. అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. అన్ని చోట్లా ఇలా జరుగుతుందని మాత్రం చెప్పలేం. ఎంతైనా ఇలా చేయటం ప్రోత్సహించే విషయం కాకపోయినా.. ప్రతీ చోటా ఇలాగే చేస్తారనుకోవటం తప్పవుతుంది. ఎంతో మంది రైతులు.. పొట్టకూటి కోసం మొక్కజొన్న పొత్తులను కాల్చుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అందరూ ఇలాంటి బొగ్గులనే వాడుతారని అనుకోలేం. కానీ.. ఇలాంటివి కంట పడితే మాత్రం కచ్చితంగా అడ్డుకోవాల్సిందే అంటూ నెటిజన్లు.. రకరకాలుగా స్పందిస్తున్నారు.