News

congress mla letter to pm, PM Modi: సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి ప్లీజ్… ప్రధానికి ఎమ్మెల్యే లేఖ – gujarat congress mla has requested modi to travel to somnath by road


గుజరాత్రాష్ట్ర ఎమ్మెల్యే.. ప్రధానికి లేఖ రాశారు. ఆగస్ట్ 27, 28వ తేదీల్లో పీఎం నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిని .. కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడాసమా విమల్ భాయ్ కనాభాయ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లెటర్ రాశారు. అందులో గుజరాత్‌కు ఆయన్ని ఆహ్వానించారు. భావ్‌నగర్-సోమనాథ్‌ రహదారిపై తప్పనిసరిగా ప్రయాణించాల్సిందిగా ప్రధానిని కోరారు. ఆ లేఖ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

“కోస్టల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ఆమోదం తెలిపింది. హైవే అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన రహదారిలో చాలా చోట్ల గుంతలు పుష్కలంగా ఉన్నాయి. అవి ప్రాణాంతకం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీనిపై నేను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రికి లేఖ రాసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.” అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు శ్రావణ మాసంలో సోమనాథ్ ఆలయానికి లక్షలాది మంది భక్తులు ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తారని వెల్లడించారు. ప్రధాని ఈ రహదారిపై వెళ్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయని, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

అయితే దీనిపై గిర్‌సోమనాథ్‌లో బీజేపీ జిల్లా కమిటీ అధ్యక్షుడు మాన్‌సింగ్ పర్మార్ స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ గురించి తనకు తెలియదని.. అయితే తాను సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. అలాగే బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ లేఖను ప్రచార స్టంట్‌గా విమర్శించారు. ఎమ్మెల్యేకు సమస్య పరిష్కారంపై నిజంగా ఆసక్తి ఉంటే.. ప్రధానికి లేఖ రాయడం కంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను సంప్రదించి ఉండేవారని అన్నారు.

Related Articles

Back to top button