News

Congress: కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ షాక్‌.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా.. | Jaiveer Shergill resigns from Congress spokesperson, writes about sycophancy, lost sync to Sonia


Jaiveer Shergill Resigns: కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులు పార్టీ ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఆరోపించారు. తన రాజీనామీ లేఖను జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను అందించారు జైవీర్ షెర్గిల్. పార్టీలోని సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారు. సానుభూతిలో మునిగితేలిన వారి స్వార్థ ప్రయోజనాలు, వాస్తవికతను నిరంతరం విస్మరిస్తాయి. ఇకపై పార్టీలో యువత భవిష్యత్తును చూడలేమని రాజీనామా లేఖలో వెల్లడించారు. యువత ఆకాంక్షలు నెరవేరేలా పార్టీ నిర్ణయాల్లో స్పష్టత ఉండటంలేదన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకలను గత ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీలోని కొందరు సీనియర్లు అనుమతి ఇవ్వడంలేదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు.. కాంగ్రెస్‌ నిర్ణయాలకు పొంతన కుదరడపోతోందని మండిపడ్డారు.

గత ఎనిమిదేళ్లుగా పార్టీ నుంచి ఏం ఆశించలేదని.. కాంగ్రెస్‌ అభ్యున్నతికే తాను కృషి చేశానన్నారు. పార్టీ అధిష్ఠానానికి సన్నిహితంగా ఉన్నవారి వద్ద తలవంచాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపించారు. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలను అందులో వివరించినట్లు తెలిపారు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైవీర్ షెర్గిర్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడానికి 24 గంటల చట్టపరమైన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించినప్పుడు అతను వెలుగులోకి వచ్చాడు. ఇది కాకుండా, జైవీర్ తరచుగా టీవీ చర్చలలో పార్టీ తరఫున పాల్గొంటుంటారు.

కాంగ్రెస్‌లో వెల్లువెత్తిన అసంతృప్తి.. 

జైవీర్ షెర్గిల్ కంటే ముందు పలువురు నేతలు కూడా కాంగ్రెస్‌లోని అనేక ముఖ్యమైన పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల, కాంగ్రెస్ జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను ప్రచార కమిటీకి అధిపతిగా నియమించింది. అయితే అతను పార్టీ ప్రతిపాదనను తిరస్కరించారు.

మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రముఖుడు ఆనంద్ శర్మ కూడా పార్టీ రాష్ట్ర యూనిట్ పాలక కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆనంద్ శర్మ ఈ చర్య తీసుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Advertisement

ఇవి కూడా చదవండి



 మరిన్ని జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button