Comedian Raghu, Raghu Karumanchi: మా ఇంట్లో మొక్కలు నాతో మాట్లాడతాయి.. కమెడియన్ రఘు ఇల్లు అద్భుతహ: – jabardasth comedian roller raghu karumanchi house with green plants
హైదరాబాద్ సిటీకి కాస్త దూరంలో ఖరీదైన భవనంలో ఉంటున్న రఘు.. తన ఇంటి విశేషాలను సుమన్ టీవీతో పంచుకుంటూ.. తాను ఎంత ప్రకృతి ప్రేమికుడో వివరించారు. ‘నాకు షూటింగ్ లేకపోతే మొక్కలు, ప్రకృతే నా ప్రపంచం. నా ఇల్లే ఆర్గానిక్ ఫామ్. ఇక్కడ దొరకనిది.. పండనిది అంటూ ఏదీ లేదు. ఒక్క ఉల్లిపాయలు తప్పితే.. మిగిలినవన్నీ మా ఇంట్లోనే పండిస్తా.. వాటినే తింటాం. పసుపు,కారం, పండ్లు, పూలు, ఆకుకూరలు మొత్తం అన్నీ పండించుకునే తింటాం. అన్నీ ఇంట్లోనే.
నాకు షూటింగ్ లేని రోజు మొక్కలకే కేటాయిస్తా. నేను లేనప్పుడు మా డ్రైవర్ నారాయణ.. మా అత్తయ్య, బామ్మర్ది, నా భార్య వీటిని చూసుకుంటారు. నాతో ఈ మొక్కలు ఎంత కనెక్ట్ అయిపోయాయంటే.. ఈ మొక్కలు నాతో మాట్లాడతాయి. రెండు రోజుల పాటు నేను వాటితో మాట్లాడకపోతే డల్ అయిపోతాయి. నేను వచ్చి మాట్లాడగానే.. మీరు నమ్ముతారో లేదో మొత్తగా అయిపోతాయి. పర్సనల్‌గా నేను మొక్కలతో ఈ అనుభూతిని పొందుతున్నాను.
కాస్త డల్‌గా ఉన్న చెట్టుదగ్గరకు వెళ్తాను.. ‘ఏమైంది.. నేను రాలేదని కోపమా? అని మాట్లాడదా.. ఓ గ్లాస్ నీళ్లు పోస్తా.. పావుగంటలో ఆ మొక్కలు వికసిస్తాయి. నేను మొక్కలతో ఇంట్రాక్ట్ అవుతా. జంతువుతో అయినా.. మొక్కతో అయినా ఇంట్రాక్ట్ అయితే అవి రియాక్ట్ అవుతాయి.. రెస్పాండ్ అవుతాయి. నేచర్‌కి మించిన లైఫ్ లేదు. అందుకే నేను ఎక్కువగా ప్రకృతికే కేటాయిస్తా. నేను ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుని అడవిలోకి వెళ్లిపోతా. కారు పార్క్ చేసుకుని టెంట్ వేసుకుంటా. ఫైర్ వేసుకుని.. అక్కడే వండుకుని తింటా.. అలా చాలా రాష్ట్రాలు తిరిగాను’ అంటూ చెప్పుకొచ్చారు రషు కారుమంచి (Raghu Karumanchi).
కాగా రఘు.. గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆది, దిల్, కిక్, మిర్చి, పిల్ల జమీందార్, అదుర్స్, టెంపర్, పటాస్, సుప్రీమ్, ఖైదీ నెం.150 వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆది సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రఘు.. ‘అదుర్స్’ చిత్రంతో నటుడిగా పాపులర్ అయ్యారు. ఇక జబర్దస్త్ కామెడీ షోలో రఘు వేసిన స్కిట్‌లు బాగా పేలడంతో.. జబర్దస్త్ రఘుగా పాపులర్ అయ్యారు.