News

Comedian Babu Mohan, Babu Mohan: ‘పూమ్ పుహార్ అంటే ఏంటి సార్’.. అర్ధం చెప్పి యాంకర్‌కి షాకిచ్చిన బాబు మోహన్ – actor babu mohan said the meaning of poom puhar


బాబు మోహన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత గబ్బు పంచాయితీలను పక్కనపెడితే.. తెలుగు సినిమా చరిత్రలో బాబు మోహన్ కామెడీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. వందలాది సినిమాల్లో నటించి.. కడుపుబ్బా నవ్వించారు బాబు మోహన్. రేయ్.. మన ‘పాయాగాడ్రా’ అని బాబు మోహన్‌ని విపరీతంగా అభిమానించేవాళ్లు.ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు కాంబినేషన్‌లో ఈపాయాగాడు చేసిన కామెడీ అయితే పొట్టచెక్కలే. కామెడీతో పాటు ఆయన నోటి నుంచి వచ్చే ‘‘అన్నా.. బుచికిబుచికి.. మాక్కి కిరికిరి.. పూమ్ పుహార్’.. లాంటి పదాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. అయితే అసలు ఆ పదాలు ఎలా వచ్చాయి.. వాటికి అసలు అర్ధం ఉందా? ఇంతకీ పూమ్ పుహార్ అంటే అర్ధం ఏంటో చెప్పుకొచ్చారు బాబు మోహన్.

తాజా ఇంటర్వ్యూలో ఓ యాంకర్ నేరుగా బాబు మోహన్‌ని.. ‘సార్ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలని అనుకుంటున్నాను.. పూమ్ పుహార్’ అంటే ఏమిటి అని అడిగింది. దానికి పెద్దగా నవ్విన బాబు మోహన్.. ఆ పదం ఎలా వచ్చింది. దానికి వెనుక ఉన్న జరిగిన కథ ఏంటో చెప్పుకొచ్చారు.

‘నన్ను హోల్ ఆంధ్రాకే సోలో అందగాడ్ని అని అనేవారు.. నాకు అదేం లేదు.. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. నన్ను ఆదరిస్తారు. మేం క్యారెక్టర్ కోసం ఎంత తపిస్తామో చెప్పడానికి ఈ పూమ్ పుహార్ లాంటి పదాలే ఉదాహరణ. కోటాగారితో నేను చేసేటప్పుడు.. మా ఇద్దరి కాంబోలో డైలాగ్‌లు కొన్ని చెప్పేవారు. ఒక్కోసారి రైటర్స్ లేనప్పుడు.. డైరెక్టర్లు చెప్పేసేవారు. సీన్ పేపర్ వాళ్లకి ఇవ్వండి.. వాళ్లే చూసుకుంటారు అనేవాళ్లు.

ఆ సీన్ పేపర్ చూసి చదువుకున్నప్పుడు.. నువ్వు ఇట్లా అను.. నేను ఇట్లా అంటా అని అప్పటికప్పుడు అనుకునేవాళ్లం.. కెమెరా ముందు చేసేసేవాళ్లం. మాకు డైరెక్షన్ చెప్పేవారు కాదు.. మేం ఏది చెప్తే అది ఓకే చేసేసేవారు. ఏది బాగుంటే అది పెట్టుకోమనేవాళ్లం. అలా అప్పటికప్పుడు చేసిన సీన్లు చాలా ఉన్నాయి. అలా వచ్చిందే ఈ ‘పూమ్ పుహార్’.

ఈవీవీ గారు చెప్పింది మాకు నచ్చడం లేదు.. డబుల్ మీనింగ్ వచ్చేట్టు ఉంది. ఈవీవీ సినిమాల వల్ల మేం బూతులు మాట్లాడుతున్నాం అని పేరు వచ్చింది. ఏవండీ ఆవిడ వచ్చింది సినిమా అప్పుడు కూడా మేం బూతులు మాట్లాడతాం అని అనేవాళ్లు.

అందుకే బూతులు కాకుండా కొత్త పదాల కోసం పరితపించేవాళ్లం. బుచికిబుచికి.. మాక్కి కిరికిరి.. పూమ్ పుహార్.. అలా వచ్చేవే. మేం కారులో వెళ్తుంటే.. వైజాగ్ దగ్గర ఒక చైనీస్ రెస్టారెంట్‌కి ‘పుహార్’ అని ఉంది. అది చూసి.. ఇక్కడ ‘పుహార్’ ఉంది.. అక్కడ ఆయన చెప్పిన డైలాగ్‌లో ఏదో బూతు ఉంది.. దాని ప్లేస్‌లో ఈ పుహార్ పెడదాం.. దాని పూమ్ తగిలిద్దాం అనుకున్నాం. వెంటనే ఈవీవీ దగ్గరకు వెళ్లి.. అన్నా అన్నా.. నాకు ఒక ఊతపదం అన్నారు కదా.. దానికి నాకో పదం వచ్చింది. ‘పూమ్ పుహార్’ అని అన్నారు. అరే భలే ఉందే.. ఎట్టొచ్చిందయ్యా నీకు ఈ ఐడియా అన్నారు. అప్పుడు ఆ చైనీస్ బోర్డ్ గురించి చెప్పాను. ఆయన చాలా బాగుందని ‘పూమ్ పుహార్’ని సినిమాలో పెట్టారు. అది పెద్ద హిట్ అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చారు బాబూ మోహన్.

Related Articles

Back to top button