News

colonel vvb reddy, Army Helicopter: టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే.. ‘చీతా’ కుప్పకూలిపోయింది – indian army cheetah helicopter crashes in arunachal pradesh


Army Helicopter: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన చీతా.. అనే హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వీవీబీ రెడ్డి(37)తోపాటు మరో మేజర్‌ జయంత్‌ మృతి చెందారు. కల్నల్‌ వీవీబీ రెడ్డి మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

Colonel VVB Reddy passed away

కల్నల్‌ వీవీబీ రెడ్డి మృతి

ప్రధానాంశాలు:

  • అరుణాచల్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌
  • లెఫ్టినెంట్‌ కల్నల్‌ వీవీబీరెడ్డి మృతి
  • పైలట్‌గా విధులు హైదరాబాద్ నివాసి
Army Helicopter: అరుణాచల్‌ప్రదేశ్‌లో.. ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా.. హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వీవీబీ రెడ్డి(37) మృతిచెందారు. ఆయన తోపాటు మరో మేజర్‌ జయంత్‌ కూడా మృతిచెందారు. కమెంగ్‌ జిల్లాలోని బంగ్లాజాగ్‌లో గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు పైలట్లు విధి నిర్వహణలో భాగంగా హెలికాప్టర్‌లో అసోంకు వెళ్తున్నారు. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకే హెలికాప్టర్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోవయాయి. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. దీంట్లో మల్కాజిగిరికి చెందిన ఆర్మీ లెప్టినెంట్‌ కల్నల్‌ ఉప్పల వినయ భానురెడ్డి (Colonel VVB Reddy) చనిపోయారు.

వీవీబీ రెడ్డికి భార్య స్పందనా రెడ్డి, కుమార్తెలు అనిక రెడ్డి, హర్విక రెడ్డి ఉన్నారు. స్పందనా రెడ్డి కూడా పుణెలో ఆర్మీలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం. వీవీబీరెడ్డి తండ్రి నర్సింహ్మారెడ్డి గత 40 సంవత్సరాల క్రితం మల్కాజిగిరిలోని దుర్గానగర్‌లో నివాసముంటున్నారు. 2007లో ఆర్మీలో ఉద్యోగం సాధించిన వీవీబీ రెడ్డి.. అంచెలంచెలుగా ఎదిగి లెప్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి చేరారు. పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ.. అదే విధి నిర్వహణలో ప్రాణాలు ఒదిలారు. Indian Army ప్రత్యేక హెలికాప్టర్‌లో వీవీబీరెడ్డి మృతదేహం శుక్రవారం హైదరాబాద్ నగరానికి రానుంది.

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button