News
CM KCR Public Meeting Live: మధిరలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ.. లైవ్ అప్డేట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్, సీఎం టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. హాట్రిక్ విజయమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో మరింత జోరు పెంచారు. రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అందుకు సంబంధించన లైవ్ అప్డేట్స్ మీకోసం..