CM KCR: మరోసారి జిల్లాలను చుట్టేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటన | Telangana CM KCR set to resume district tours in state from January 12
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జిల్లాలను చుట్టేయనున్నారు. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 12న రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జిల్లాలను చుట్టేయనున్నారు. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 12న రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు కేసీఆర్. 12న ఉదయం మహబూబాబాద్ కలెక్టరేట్‌ను, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభిస్తారు. అలాగే, జనవరి 18న ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ప్రారంభించనున్నారు. మొత్తంగా ఈ నెలలో మూడు కలెక్టరేట్ భవనాలు ప్రారంభంకానున్నాయి. గతేడాది కూడా ఒకే నెలలో ఇదే తరహాలో నాలుగైదు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్స్ను ప్రారంభించారు కేసీఆర్. ఇప్పుడు మరో మూడు జిల్లాలో కొత్త భవనాలు పూర్తి కావడంతో సీఎం టూర్ షెడ్యూల్ ఖరారైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. మరికొన్ని తుదిదశ నిర్మాణ పనులు సాగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..