CM KCR: గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ.. పార్టీ నేతలు హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు.. | Telangana cabinet meeting tomorrow, CM KCR will finalize the names of MLCs in the governor’s quota
ఎమ్మెల్సీల పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఫైనల్ చేయనున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో గురువారం మధ్యాహ్నం కేబినెట్ భేటీ కానుంది. ఇండ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి యోచనలో ఉంది కేసీఆర్ సర్కార్. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కేబినెట్‌లో చర్చించి.. ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్.
ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం… ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా ప్లాన్ చేస్తోంది. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించారు. దీంతో పట్టాల పంపిణీకి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గ్రామకంఠం సహా ఇతరత్రా ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దళితబంధు పథకం అమలుపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడం, నిధుల సమీకరణపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.
ఇదిలావుంటే, పార్టీలో హాట్ హాట్ ఇష్యూగా మారిన ఎమ్మెల్సీల పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఫైనల్ చేయనున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈనెల 10వ తేదీ (ఎల్లుండి) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనున్నది.
ఈ విస్తృతస్థాయి సమావేశంలో .. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు పాల్గొంటారు.
ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో … ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సిఎం కేసిఆర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం