News

CM Jagan: ఢిల్లీకి పర్యటనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఈ సారి ఆ అంశాలపైన స్పెషల్ ఫోకస్..


Cm Jagan (File Photo)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఢిల్లీ వేదికగా జరుగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకానున్నారు.. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఢిల్లీకి పయనమయ్యారు. రేపు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ముందుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం అవుతారు. శనివరం నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఎల్లుండి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కేవలం ఆ సమావేశంలో పాల్గొనడమే కాకుండా.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నీతి ఆయోగ్‌ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కేంద్రం సాయం.. ఏపీ కోరుకుంటున్న సహకారం.. పెండింగ్ అంశాలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి జగన్ ఇక్కడ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్‌ సమావేశంలో మాట్లాడే అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. అలాగే ఏపీ సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు సీఎం జగన్. ఈ సందర్భంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర ఆర్ధిక సహకారం కోరనున్నారు. ఇటీవల ఆర్దిక లోటు కింద రూ. 10 వేల కోట్ల పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెండింగ్ నిధులను విడుదల పట్ల ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు తెలపనున్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Related Articles

Back to top button