chits fraud, ‘అతడిని పట్టిస్తే రూ.3 లక్షలు ఇస్తాం’.. జగిత్యాలలో ఇంట్రెస్టింగ్ ఫ్లెక్సీలు – rs. 4 crore scam with chits in jagtial district
దీంతో మోసపోయామని గ్రహించిన దాదాపు 150 మంది బాధితులు అతడి ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటిని పట్టిస్తే.. రూ. 3 లక్షలు ఇస్తామంటూ బాధితులంతా జగిత్యాల నగరంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రూపాయి, రూపాయి కూడబెట్టి చిట్టీలు వెస్తే నిండా ముంచి పరారయ్యాడని బాధితులు వాపోతున్మారు.
వెంకటి గత 30 ఏళ్లుగా జగిత్యాలలో ఉంటుండు. నేను రూ.5 లక్షల చిట్టీ వేసిన. 19 నెలలు ప్రతి నెలా చిట్టీ డబ్బులు కట్టిన. ఈ జనవరిలో డబ్బులు ఇస్తా అని చెప్పిండు. గత నెల 28 నుంచి కనబడకుండా పోయిండు. కుటుంబంతో సహా పారిపోయాడు. తిండి తిప్పలు మాని మేం రూపాయి రూపాయి కూడబెట్టుకొని వెంకటి కాడ చిట్టీలు వేసినం. మాకు ఎలాగైనా న్యాయం చేయలాని కోరుతున్నాం. అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే చిట్టీలు వేసే సమయంలో బాగా నమ్మకస్తుల దగ్గర మాత్రమే వెయ్యాలని పోలీసులు చెబుతున్నారు. మోస పోయాక బాధపడితే లాభం లేదని అంటున్నారు. చిట్టీలు వేసే వ్యక్తులు ఆ ప్రాంతంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు ? గతంలో వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ? చిట్టీల డబ్బులు తిరిగి చెల్లించే వారేనా ? అనేది చిట్టీలు వేసేవారు ముందుగానే గ్రహించాలని పోలీసులు చెబుతున్నారు.
- Read More Telangana News And Telugu News