Chinmayi: ఇదీ సంగతి.. రాహుల్ కోసం సింగర్ చిన్మయిని ఒప్పించిన సందీప్ కిషన్! – ala modalaindi latest promo with rahul ravindran, chinmayi sripaada as guests
వచ్చీ రాగానే
“
మంచితనానికి మాయిశ్చరైజర్ పెడితే రాహుల్ రవీంద్రన్ అంటాం మేము.. సత్యానికి శానిటైజర్ పెడితే చిన్మయి..” అంటూ వచ్చీ రాగనే వెన్నెల కిశోర్ ఇద్దరికీ చెరొక బిస్కెట్ వేసేశాడు. అంతలో రాహుల్ ఏదో చెప్పబోతే “నన్ను మాట్లాడనివ్వరా అప్పుడప్పుడు.. నన్ను కొంచెం టీవీ హోస్ట్‌లా చూడండి.. రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడండి..” అని ఆటపట్టించాడు కిశోర్.లవ్ స్టోరీ అలా
ఇక తమ లవ్ స్టోరీ గురించి రాహుల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడు. “డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరూ క్యూట్ ఉన్నాడు కదా.. అని తనకు అనిపించిందట.. తర్వాత చెప్పింది ఇది.. పెళ్లి తర్వాత..” అని రాహుల్ అంటే “అయ్యో ఇదేంటో వాగుతున్నాడు..” అంటూ చిన్మయి క్యూట్‌గా చెప్పింది. “పెళ్లి వద్దనుకున్నా..” అని చిన్మయి చెబితే “నేను తనను కలిసేముందు పెళ్లి వద్దనుకున్నా.. కళ్లల్లో కళ్లు పెట్టి ఒకటి చెప్పాను..” అని రాహుల్ సీరియస్‌గా ఏదో చెబుతుంటే “కళ్లల్లో కళ్లు పెట్టి ఏం చెప్పలేదు..” అంటూ చిన్మయి ఆటపట్టించింది. “అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను మాత్రం ఎందుకంత దిగజారిపోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను.. అరగంట తర్వాత కొడతా ఉంది ఏదో..” అని రాహుల్ అన్నాడు. దీంతో “మనం ఎన్నో సార్లు దిగజారిపోయాం కదరా..” అని కిశోర్ కౌంటర్ ఇచ్చాడు.
సందీప్ కిషన్
ఇక వీళ్లను కలిపిన వ్యక్తి ఎవరా అన్న ఆడియన్స్‌కు మొత్తానికి ఓ క్లారిటీ దొరికింది. “సందీప్ ఫుల్.. నువ్వు రాహుల్‌ను కలవాలి, రాహుల్‌ను మీట్ అవ్వాలి అని చెప్పి..” అని చిన్మయి చెబితే “వీడు నా కోసం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాడు..” అని రాహుల్ అన్నాడు. “మార్కెటింగ్‌లో సందీప్ కిషన్‌ది వేరే లెవల్ యాక్చువల్‌గా..” అంటూ కిశోర్ పరువు తీశాడు.
ఆ క్షణం ఔట్
ఇక చిన్మయి డెలివరీ టైమ్‌లో జరిగిన విషయం గురించి కూడా రాహుల్ చెప్పాడు. “ఏమీ కాదు నువ్వు పాడమ్మా అన్నారు.. ఈమెకు అనస్థీషియా ఇచ్చారు.. సోం ఏం జరుగుతుందో తెలీదు.. చిన్మయి లోపల నుంచి పాడుతుంది.. ఆల్ మోస్ట్ నేను కళ్లు తిరిగి పడిపోయాను.. గ్రిప్తాని తీసుకొచ్చి చిన్ను పక్కన పెట్టగానే నవ్వింది గ్రిప్తా.. పిల్లలను నా చేతిలో పెట్టగానే ఔట్ బ్రో నేను.. ఔట్ అసలు” అని రాహుల్ చెబుతుంటే చిన్మయి అలా వింటూ ఉంది. ఇలా ప్రోమో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి!
అలా మొదలైంది ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Read latest TV News and Movie Updates