China – Taiwan Tensions: అగ్రరాజ్యం అమెరికాపై చైనాకు కోపం.. యుద్ధానికి కాలుదువ్వుతోందా..? మరో సంక్షోభం తప్పదా? | China Taiwan Tensions post pelosi visit china begins live fire military drills in six zones
China Taiwan Tensions: తైవాన్‌పై వార్‌కు డ్రాగన్ దేశం సై అంటే ప్రపంచానికి మరో సంక్షోభం తప్పదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే… తమ హెచ్చరికలను లెక్కచేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో..
China Taiwan Conflict: అగ్రరాజ్యం అమెరికా ప్రవర్తనతో డ్రాగన్ దేశం చైనాకు కోపం వచ్చిందా..? దీంతో మరో యుద్ధానికి చైనా కాలుదువ్వుతోందా..? తైవాన్‌పై వార్‌కు డ్రాగన్ దేశం సై అంటే ప్రపంచానికి మరో సంక్షోభం తప్పదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే… తమ హెచ్చరికలను లెక్కచేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్ లో పర్యటించడంపై ఆగ్రహంతో ఊగిపోతోంది చైనా. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలకు తెరలేపింది. ఒకవేళ తైవాన్ పై చైనా యుద్ధానికి దిగితే ప్రపంచంలో మరో సంక్షోభం తలెత్తే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్(Russia – Ukraine) మధ్య యుద్ధంతో చిన్న దేశాల మనుగడ ప్రమాదంలో పడినట్లైంది. ఇక చైనా తైవాన్ పై యుద్ధానికి సై అంటే… భవిష్యత్తులో చిన్న దేశాల మనుగడకు మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. చైనా-తైవాన్ మధ్య వివాదానికి, రష్యా- ఉక్రెయిన్ మధ్య వివాదానికి ఒక రకంగా సారుప్యత కనిపిస్తోంది. రష్యా సమీపంలో చిన్న దేశంగా ఉన్న ఉక్రెయిన్ తరహాలోనే చైనాకు దగ్గరల్లో తైవాన్ ఉంది. గతంలో సోవియెట్ యూనియన్ లో ఉక్రెయిన్ భాగం కాగా.. తైవాన్ చైనాలో అంతర్భాగంగా ఉండేది. 19649లో చెలరేగిన అంతర్యుద్దంతో చైనా నుంచి తైవాన్ విడిపోయినప్పటికి ఈ విభజనను డ్రాగన్ దేశం గుర్తించడంలేదు. తైవాన్ మాత్రం తమది సర్వసత్తాక, స్వతంత్ర్య దేశమని ప్రకటించుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది. తమ దేశంలో తైవాన్ విలీనం కావల్సిందేనని చైనా యుద్ధ విమానాల విన్యాసాలు, సైన్యం మోహరింపుతో బెదిరింపులకు దిగుతోంది. మరోవైపు చైనా ఆగడాలను కట్టడి చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా,ఐరోపా దేశాలను తైవాన్ కోరుతోంది.
ఈక్రమంలో అమెరికా ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. పెలోసీ తైవాన్ లో పర్యటించవద్దని.. పర్యటిస్తే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని చైనా ఎన్ని హెచ్చరికలు జారీచేసినా అగ్రరాజ్యం అమెరికా పట్టించుకోవలేదు. దీంతో తైవాన్ కు అమెరికా మద్దతుగా నిలబడటం చైనాకు నచ్చడంలేదు. అందుకే పెలోసీ తైవాన్ లో ఉండగానే ఆ దేశానికి సమీపంలోని ఆరు జోన్లలో డ్రాగన్ మిలిటరీ లైవ్ డ్రిల్ చేపట్టింది. తైవాన్ ద్వీపం చుట్టూ భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలకు తెరలేపింది.

China Taiwan conflict
మరోవైపు చైనా యుద్ధ విన్యాసాలపై తైవాన్ రక్షణశాఖ స్పందించింది. డ్రాగన్ దేశం విన్యాసాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలను తాము కోరుకోవడం లేదని.. అయితే యుద్ధం వంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తైవాన్ స్పష్టం చేసింది. చైనా ఓ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తైవాన్ ఆరోపించింది.
అటు తైవాన్ ద్వీపం సమీపంలో తమ సైనిక విన్యాసాలను చైనా సమర్థించుకుంటోంది. పెలోసీ పర్యటనతో అమెరికా తమను రెచ్చగొట్టిందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ విన్యాసాలు చేపడుతున్నామని తెలిపింది. ఈ దశలో తైవాన్ ను కలుపుకోవడానికి ఇదే మంచి సమయమని.. రష్యా నుంచి మద్దతు ఉండటంతో వార్ కు దిగాలనే యోచనలో డ్రాగన్ కంట్రీ ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..