News
chillakallu police station, పోలీస్ స్టేషన్‌లో అవినీతి భాగోతం.. ఏసీబీ అధికారుల మెరుపుదాడి! – acb officers catch police who take bribe in ntr district
చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదైన అక్రమ బొగ్గు రవాణా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై గత నెల రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా బొగ్గు రవాణాకు పాల్పడ్డ వ్యక్తులు కేసు నుంచి తప్పించుకునేందుకు ఎస్సై దుర్గా ప్రసాద్‌కు రూ. 5 లక్షలు లంచం ఆశ చూపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి దీనికి సంబంధించి రూ. 3 లక్షల నగదును చిల్లకల్లు టోల్‌గేటు వద్ద సదరు వ్యక్తుల నుంచి కానిస్టేబుల్ సునీల్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా లంచం గురించి ఎస్సైని విచారించి నివేదిక తీసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు సైతం పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, అంతకుముందే మరో రూ.2 లక్షలను ఎస్సైకి అందజేసినట్లు బాధితులు చెబుతున్నారు.