Cheryal Transgender,చేర్యాలలో ‘ఇంద్ర’ సీన్ రిపీట్.. వామ్మో ఇది మామూలు మోసం కాదు భయ్యా! – indra movie scene repeat in cheryal, transgender absconds with gold
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణానికి చెందిన మధు అనే వ్యక్తికి.. విజయవాడకు చెందిన అబిద్ షేక్ మస్తాన్ అనే హిజ్రాతో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఓ సారి చేర్యాలలోని తన ఇంటికి మస్తాన్‌ని మధు ఆహ్వానించాడు. ఇంట్లోని వారి ఒంటిపై ఉన్న నగలు చూసిన హిజ్రా.. వాటిని కొట్టేయాలని ఫ్లాన్ చేసింది. ఈ క్రమంలో ఈ ఇంట్లో దోశం ఉందని.. అది మీ ఎదుగుదలను అడ్డుకుంటుందని మధు కుటుంబాన్ని భయపెట్టింది. ఇంట్లో అమ్మవారికి అలంకరణ చేసి శాంతి పూజలు చేస్తే దోశం తొలిగిపోతుందని నమ్మిస్తుంది.
హిజ్రా చెప్పిన మాటలకు భయపడిపోయిన మధు.. పూజలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో పూజాల పేరుతో షో చేసిన హిజ్రా.. అమ్మవారికి అలంకరించాలంటూ ఇంట్లో కుటుంబ సభ్యుల ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం, 5 తులాల వెండి గొలుసులు తీసి విగ్రహానికి పెట్టింది. పూజ అనంతరం అమ్మవారి విగ్రహాన్ని పాతి పెట్టి నగలను బయటకు తీస్తే అంతా మంచే జరుగుతుందని.. చెరువు గట్టున విగ్రహాన్ని పూడ్చి పెట్టాలని నమ్మించి ఓ చెరువు దగ్గరికి తీసుకెళ్లింది. మధుని చెరువు గట్టుకు ఉన్న గుడి దగ్గర కూర్చోబెట్టి విగ్రహన్ని పూడ్చిపెట్టి వస్తానని చెప్పిన హిజ్రా నగలతో ఉడాయించింది.
చాలా సేపైనా.. హిజ్రా తిరిగి రాకపోవటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినా ఆమె జాడ దొరకలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. తను ఎంతో కష్టపడిన సంపాదించిన సొమ్మును హిజ్రా నమ్మించి ఎత్తుకెళ్లిందని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హిజ్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Read More Telangana News And Telugu News