News

Chandrababu Naidu Case Updates,నారావారిపల్లిలో చంద్రబాబు కులదైవం నాగాలమ్మకు పూజలు – chandrababu naidu birth place naravaripalli villagers offers prayers to nagalamma


నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భావోద్వేగానికి గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో ఆయన కులదైవం నాగాలమ్మకు గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. ‘చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయనకు మంచి జరగాలని ప్రార్థించాం. కులదైవం అయిన నాగాలమ్మకు పూజ చేసి వేడుకున్నాం’ అని ఓ మహిళ తెలిపారు. మిట్టూరు తదిరత పొరుగు గ్రామాలకు చెందిన ప్రజలకు కూడా ఇక్కడికి వచ్చి నాగాలమ్మకు టెంకాయలు కొట్టారు. చంద్రబాబు నాయుడు అమ్మా, నాన్నలైన అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వంత కొంత మంది అభిమానులు టెంకాయలు కొట్టి, చంద్రబాబుకు మంచి జరగాలని వేడుకున్నారు.

టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. చంద్రబాబు అరెస్ట్‌పై మహిళలు కన్నీరు పెడుతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుకు సంబంధం లేని, ఆధారాలు లేని కేసు ఇదని ఆమె అన్నారు. ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

ములాఖత్ అనంతరం భువనేశ్వరి భావోద్వేగం
కుటుంబం కంటే ప్రజలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. రాజమండ్రి జైలులో మంగళవారం (సెప్టెంబర్ 12) సాయంత్రం 4 గంటలకు లోకేష్, బ్రాహ్మణితో కలిసి ఆమె ములాఖత్‌లో చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడారు. జైల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎప్పుడూ జనం గురించే ఆలోచించేవారు. ఆయన కోసం ప్రజలే పోరాడాలి’ అని భువనేశ్వరి అన్నారు.

Rajahmundry: చంద్రబాబును కలిసిన అనంతరం ఎమోషనలైన భువనేశ్వరి

మరోవైపు.. చంద్రబాబు హౌస్ రిమాండ్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదంటూ ఏసీబీ తరఫు న్యాయవాది వినిపించిన వాదనలను సమర్థించింది. ఈ పిటిషన్‌పై రెండు రోజుల పాటు వాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే.

అటు టీడీపీ శ్రేణులు ‘బాబుతో నేను’ లోగోను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా ‘#IAmWithBabu’ ట్యాగ్‌ను రూపొందించి పాట విడుదల చేశారు.

Related Articles

Back to top button