News
chandrababu naidu, రైతులు, పేదలకు మధ్య గొడవలు సృష్టించే కుట్ర.. సీఎం జగన్ పక్కా ప్లాన్: చంద్రబాబు – tdp chief chandrababu naidu allegations against cm ys jagan mohan reddy
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వాదించే న్యాయవాదులకే ప్రభుత్వ సంబంధిత కేసులు అప్పగించటం వెనుక ఆంతర్యమేంటని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. వివేకా హత్య కేసు నిందితుల తరఫున వాదించే న్యాయవాదులకు ప్రభుత్వ కేసులు అప్పగిస్తూ.. వారికి ప్రజాధనం దోచిపెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ఒక వైపు బాబాయ్ హత్య జరుగుతుంటే ఇంకోవైపు పార్టీ మేనిఫెస్టో మీటింగ్ పేరుతో డ్రామా ఆడారని ఆరోపించారు. రాయలసీమలో ఒక హత్య చేస్తున్నప్పుడు.. పోలీసులకు దొరకకుండా మరోవైపు ఇలాంటి నాటకాలు ఆడుతారని విమర్శించారు. అజేయ కల్లాం లాంటి రిటైర్డ్ అధికారులను కూడా పిలిచి మర్డర్ కేసును దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారన్నారని పేర్కొన్నారు. ఆరోజున ఉదయం 5 గంటల సమయంలోనే మా బాబాయ్‌కి గుండెపోటు వచ్చిందని అజేయ కళ్లం వాళ్ల దగ్గర దొంగ ఏడుపులు ఏడ్చారన్నారు. దానర్థం బాబాయ్ హత్యలో చాలా మంది పాత్ర ఉందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆర్- 5 జోన్ వ్యవహారంలోనూ పేదల్ని వంచిస్తూ అధిక మొత్తంలో ప్రజా ధనాన్ని ఫీజుల రూపంలో న్యాయవాదులకు చెల్లిస్తున్నారని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఈ వేసవిలో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.