News

chandrababu naidu, మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగరాయాలి.. లోకేష్‌కు చంద్రబాబు దిశానిర్దేశం – tdp chief chandrababu naidu review meeting with nara lokesh over mangalagiri constituency


మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగరాయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారా లోకేష్‌కు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు తాజా సర్వేల ఆధారంగా గురువారం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సమీక్షించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి లోకేష్‌ను పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందన్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో తాను ఓడిపోయినా, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువకాగలిగామని ఈ సందర్భంగా లోకేష్.. అధినేతకు వివరించారు.

మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ తరఫున సాయంతో పాటు, తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నట్లు లోకేష్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల్ని చైతన్యం చేయడంతో పాటు వారికి అండగా నిలుస్తున్నామన్నారు. దీంతో గెలుపు గ్యారంటీ అని అలసత్వం వహించవచ్చని చంద్రబాబు సూచించారు. పార్టీ స్థానిక నాయకులతో సమిష్టిగా పనిచేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరుగులేని విజయం సాధించేలా ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Related Articles

Back to top button