News

chandrababu naidu, కె.విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు – tdp chief chandrababu naidu tribute to k viswanath


సినీ ఇండస్ట్రీలో ప్రఖ్యాత దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.


ఈ క్రమంలో కె.విశ్వనాథ్‌ నివాసానికి ఆదివారం వెళ్లిన చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కె.విశ్వనాథ్ సమాజానికి అవసరమైన ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించారని చంద్రబాబు కొనియాడారు.

కాసాని జ్ఞానేశ్వర్ నివాసానికి చంద్రబాబు
మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్‌ తల్లి కాసాని కౌసల్య (93) మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కౌసల్య 2007 నుంచి 2012 వరకు బాచుపల్లి సర్పంచ్‌గా సేవలందించారు. రాష్ట్ర టీడీపీ నేతలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కౌసల్య మృతిపట్ల సంతాపం తెలిపారు.

Related Articles

Back to top button