News

chandrababu naidu, ఏపీ నూతన గవర్నర్‌తో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ – tdp chief chandrababu naidu meeting with governor justice abdul nazeer


ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ జరిగింది. గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులను గవర్నర్‌కు చంద్రబాబు పరిచయం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌గా తాను లెర్నర్‌నని ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటున్నానని టీడీపీ నేతలతో జస్టిస్ అబ్దుల్ నజీర్ సరదాగా మాట్లాడారు. నేతలందరినీ పరిచయం చేసుకున్నాక చంద్రబాబుతో విడిగా దాదాపు 40 నిమిషాలు పాటు మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై నూతన గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. గవర్నర్ దృష్టికి వివిధ పరిణామాలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Related Articles

Back to top button