chandrababu naidu, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్.. ఆ విషయం తేలిపోయింది! – tdp chief chandrababu naidu first reaction over mlc election results
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తేనే వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందన్నారు. ఈ ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. ప్రజాగ్రహం ఉంటే మనీ పవర్, మజిల్ పవర్ వంటివి ఏం చేయలేవనేదానికి ఈ ఎన్నికల ఫలితాలే సంకేతమన్నారు. నీరో చక్రవర్తి తరహాలోనే జగన్ ప్రభుత్వం కూడా నాశనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
అలాగే, రాజధాని విషయంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతుని యనమల ఆక్షేపించారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా విశాఖపట్నంకు రాజధానిని తరలిస్తామని చెప్పడం తప్పన్నారు. పార్లమెంటులో చట్ట సవరణ జరిగితే తప్ప రాజధాని మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నంలో రాజధానిని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వైసీపీని చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. అందుకే వైసీపీ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు.