Chandrababu Case,రెండేళ్ల పాటు సాక్ష్యాధారాలు సేకరించాకే అరెస్ట్.. హైకోర్టులో వాడీవేడీ వాదనలు.. తీర్పు రిజర్వ్ – hearing in ap high court on chandrababu naidu quash petition on skill development case
ఆ తర్వాత సీఐడీ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వర్చువల్‌గా తన వాదనలు వినిపించారు. రోహత్గీ తన వాదనలు వినిపిస్తూ… చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. కేసు నమోదైన తర్వాత రెండేళ్ల పాటు సాక్ష్యాధారాలు సేకరించాకే అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు రోహత్గీ.
సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జీషీట్లు అయినా వేయవచ్చునని.. ఎంతమంది సాక్ష్యులను అయినా కేసులను చేర్చవచ్చునన్నారు రోహత్గీ. రూ.3 వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీల జాడ తీస్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఎలా వెళ్లిందో తెలియాలన్నారు. అన్ని బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని కోర్టుకు తెలిపారు. ఈ డీల్‌కు అసలు కేబినెట్ ఆమోదమే లేదన్నారు. టీడీపీ అధినేత పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ రోహత్గీ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.