News

Chamakura Malla Reddy,వివస్త్రకు గురైన యువతికి పెళ్లి చేయిస్తాం, ఉద్యోగం ఇస్తాం: మంత్రి మల్లారెడ్డి – minister malla reddy responded on undressed young woman issue in medchal


మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్‌‌లో ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి.. చర్యలకు ఉపక్రమించింది. కాగా.. ఈ విషయంపై అదే నియోజకవర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బాధిత యువతిని పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి.. అండగా నిలుస్తానంటూ మాట ఇచ్చారు. బాధిత యువతికి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మల్లారెడ్డి. అంతేకాదు.. యువతికి పెళ్లి కూడా చేపిస్తానని భరోసా ఇచ్చారు. అంతేనా… డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వాలని అధికారులను మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. భవిష్యత్‌లో సదరు యువతి యోగక్షేమాలు కూడా తానే చూసుకుంటామని కుటుంబ సభ్యులకు మంత్రి మల్లారెడ్డి అభయం ఇచ్చారు.

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని బాలాజీ నగర్ బస్టాండ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఓ కీచకుడు అత్యాచారానికి యత్నించాడు. నడిరోడ్డుపైనే ఆమెను దుస్తులన్ని చింపేసి వివస్ర్తను చేశాడు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపైన కూడా ఆ కీచకుడు దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు 15 నిమిషాల పాటు బాధితురాలిని నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టాడు.

జాతీయ మహిళా కమిషన్ స్పందన..

ఈ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై వారంలోగా నివేదిక పంపించాలని డీజీపీ అంజనీ కుమార్‌ను ఆదేశించింది. బాధితురాలికి పూర్తి వైద్య సాయం అందించాలని సూచించింది.

గవర్నర్ తమిళిసై స్పందన..

ఇక ఇదే ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా స్పందిచారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.

కోకాపేట, మోకిలా బూస్టింగ్.. HMDA పరిధిలో మళ్లీ భూముల వేలం
‘బావా కలవాలని ఉంది’ అని ప్రేయసి నుంచి మెస్సేజ్.. నమ్మి వెళ్తే ఇంత మోసమా..?

Advertisement

Related Articles

Back to top button