News

CBI Raids: మాజీ ముఖ్యమంత్రి నివాసంపై సీబీఐ దాడులు.. కీలక ఆధారాలు లభ్యం | CBI Raid: cbi team at former bihar cm rabri devis patna residence over land for job scam


దేశంలో సీబీఐ దాడులు ముమ్మరం చేస్తున్నాయి. అక్రమ అస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై సీబీఐ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు…

దేశంలో సీబీఐ దాడులు ముమ్మరం చేస్తున్నాయి. అక్రమ అస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై సీబీఐ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇక తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్డీ దేవి నివాసంలో సీబీఐ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఉద్యోగ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ భార్య రబ్డీదేబీ నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది.

లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రాబ్డీ దేవి, కుమార్తె మిసాకు సంబంధించిన స్థలాలతో పాటు పాట్నా, గోపాల్‌గంజ్, ఢిల్లీలోని 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. కొంతమంది అనర్హులకు అతి తక్కువ ధరలకు భూములు బదలాయించి ఉద్యోగాలు ఇప్పించారని, లాలూ ప్రసాద్, రాబ్డీ దేవి, మీసా యాదవ్, హేమా యాదవ్, మరికొందరు అనర్హులను సీబీఐ ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న కేసు ఇది.

లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది. అభ్యర్థులకు భూమికి బదులుగా ఉద్యోగాలు కల్పించారు. యాదవ్ కుటుంబానికి సంబంధించిన కంపెనీలు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధాన ఆస్తులను సంపాదించుకున్నాయి. కొంతమంది అభ్యర్థులకు సంబంధించిన ఆధారాలు సీబీఐ వద్ద లభించాయి. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొందరికి ఉపాధి కల్పించేందుకు భూములు తీసుకున్నారని సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి



లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే నాలుగు ఇతర దాణా కుంభకోణం కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఐదవ, చివరి కేసులో నిందితుడిగా ఉన్నారు. లాలూ ప్రసాద్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు మొత్తం రూ.60 లక్షల జరిమానా విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button