Entertainment

వివాహితకు సినీ కెమెరామెన్ వేధింపులు.. ‘నువ్వంటే ఇష్టం.. నాతో ఉండిపో’ అంటూ నడిరోడ్డుపై ..


Films

తెలుగు చిత్రపరిశ్రమలో పలు సినిమాలకు పనిచేసిన కెమెరామెన్‏పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తన ఇంటి ఎదురుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఓ వివాహితను వేధింపులకు గురిచేస్తున్నాడని సమాచారం. వివరాల్లోకెలితే.. యూసుఫ్ గూడ సమీపంలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న కూనపరెడ్డి శ్రీనివాస్.. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో కెమెరామెన్‏గా.. యాడ్స్ డైరెక్టర్‎గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలకు కెమెరామెన్‏గా పనిచేశారు. అయితే తన ఇంటి ఎదురుగా భర్త, పిల్లలతో కలిసి ఓ వివాహిత నివాసముంటుంది. ఆమె కుటుంబంతో పరిచయం ఉండడంతో సదరు వివాహితను కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సదరు వివాహిత ఇంటి ముంది నిలబడి కేకలు వేయడం.. ఆమె గురించి చెడుగా మాట్లాడటం.. నువ్వంటే ఇష్టం.. నాతో ఉండిపో అంటూ ఆమెను నడిరోడ్డుపై మాట్లాడించడం.. తన మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నాడ. మధ్యం మత్తులో ప్రవర్తిస్తున్నాడని భావించిన సదరు మహిళ కుటుంబసభ్యులు.. పలుమార్లు అతడిని మందలించినా.. అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన వివాహిత అతడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై పోలీసులు ఐపీసీ 354 (డి), 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related Articles

Back to top button