Guess The Actress: అప్సరసలకు కూడా అరువు ఇచ్చేంత అందం.. ముట్టుకుంటే మాసిపోయే మేను.. ఎవరీ బ్యూటీ.

సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫొటోలు వైరల్ కావడం ఇటీవల కామన్‌గా మారిపోయింది. తమ లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ అవుట్ ఫిట్స్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ వేడి పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాను హీటెక్కించింది. పైన ఫొటోలో కనిపిస్తున్న అ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.? నట వారసత్వం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ.
తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయై రెండో సినిమాతోనే బాలీవుడ్‌లో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. నటిగానే కాకుండా గాయనిగా కూడా తన మల్టీ ట్యాలెంట్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే అనుకున్నంత తక్కువ సమయంలో మాత్రం విజయాన్ని అందుకోలేక పోయింది. పవన్ కళ్యాణ్ మూవీ ద్వారా తొలిసారి భారీ సక్సెస్‌ను రుచి చూసిందీ బ్యూటీ. ఈ అందాల తార తండ్రి నటనకు పెట్టింది పేరు. ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో అర్థమై పోయినట్లుంది కదూ. అవును మీ గెస్ కరెక్ట్. ఈ బ్యూటీ మరెవరో కాదు.. మల్టీ ట్యాలెంటెడ్ శృతీహాసన్.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శృతీ తాజాగా బ్లాక్ డ్రస్‌లో దిగిన ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది. వీటిలో వెనక్కి తిరిగి వీపు చూపిస్తూ పోస్ట్ చేసిన ఫొటో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. బ్లాక్ క్యాండ్ కేన్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక శృతీ కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ఇటీవల వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్‌లోనూ నటిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గుతున్నాయని అనుంటకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా కెరీర్‌లో దూసుకుపోతోందీ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..