ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది. బోల్తా పడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ బాబు (50) గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన 40 మంది భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం సమీపంలో శుక్రవారం (జనవరి 6) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
బస్సు ఒక్కసారిగా రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుదుపులకు కొంత మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కొంత మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. డ్రైవర్ మృతి చెందడంతో విషాదం నెలకొంది.
పెళ్లైన గంటకే విడాకులు.. తమ్ముడికిచ్చి మళ్లీ పెళ్లి!
అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. ఇంటికెళ్లి, టీ తాగి మరుసటి రోజు మృతి