Mem Famous: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. థియేటర్‌లో ఫ్రీగా ‘మేమ్ ఫేమస్’ .. ఎప్పుడు, ఎక్కడంటే?
‘మేమ్.. ఫేమస్’ ఇటీవల అందరి నోళ్లల్లో నానుతోన్న సినిమా పేరు. విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్, నవీన్ పొలిశెట్టి, విజయ్ ఆంథోని వంటి స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రమోట్ చేశారంటే ఇందులో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని చెప్పుకోవచ్చు.
‘మేమ్.. ఫేమస్’ ఇటీవల అందరి నోళ్లల్లో నానుతోన్న సినిమా పేరు. విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్, నవీన్ పొలిశెట్టి, విజయ్ ఆంథోని వంటి స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రమోట్ చేశారంటే ఇందులో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టే శుక్రవారం ( మే26) విడుదలైన మేమ్ ఫేమస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజే కోటీ రూపాయిలకు పైగా గ్రాస్‌ను సాధించింది. చిన్న సినిమా.. పైగా అందరూ కొత్త వాళ్లే.. అలాంటిది మొదటి రోజే కోటి రూపాయలు కలెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. కాగా వెరైటీగా ప్రమోషన్లు చేస్తూ తమ సినిమాను జనాల్లోకి తీసుకెళుతోన్న మేమ్ ఫేమస్ మూవీ యూనిట్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఆడియెన్స్‌తో కలిపి సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించుకోనుంది. ఇందులో భాగంగా మేమ్ ఫేమస్ సినిమాను ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్‌లో శనివారం (మే 27) సాయంత్రం 6 గంటల షోకు ఫ్రీగా చూడొచ్చని తెలిపింది. అయితే ఈ అవకాశం కేవలం విద్యార్థులకు మాత్రమే. ఆధార్/ కాలేజీ ఐడీ కార్డ్ చూపించి థియేటర్‌లోకి రావొచ్చని మూవీ యూనిట్ తెలిపింది.
మేమ్ ఫేమస్ హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు సుమంత్ ప్రభాస్. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలో నటించారు. ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లహరి ఫిల్మ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరో సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాయి. శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. కాగా ప్రారంభం నుంచి భిన్నంగా ప్రమోషన్లు నిర్వహిస్తోన్న చిత్రబృందం మొదటి రోజు కేవలం రూ. 99 కే టికెట్లు విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు స్టూడెంట్స్‌కు ఫ్రీగా సినిమా చూసే అవకాశం కల్పించడంతో తమ సినిమా జనాల్లోకి మరింత వేగంగా వెళుతుందని మూవీ యూనిట్ భావిస్తోంది.
Hyderabad: Join the team of #MemFamous at Gokul 70MM at 6 PM today!
Free entry for all the students walking in with an ID. pic.twitter.com/kBteAsl8gm
Advertisement— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి