Entertainment

BTS Boy band: BTS బాయ్స్ నోట మన పాట.. నాటు నాటు సాంగ్ పాడుతూ స్టెప్పులు కూడా..


వీరి సాంగ్స్  విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచమంతా అభిమానులున్నారు. అయితే ఈ బీటీఎస్ లోని ఒక సింగర్ కు మన నాటు నాటు సాంగ్ అంటే యమా ఇష్టమట.

వరల్డ్ ఫెమస్ అయిన బీటీఎస్ గురించి అందరికి తెలిసిందే. కొరియన్ బాయ్స్ బీటీఎస్ అనే గ్రూప్ గా ఏర్పడి లైవ్ లో సాంగ్స్ పాడుతూ అలరిస్తున్నారు. వీరి సాంగ్స్  విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచమంతా అభిమానులున్నారు. అయితే ఈ బీటీఎస్ లోని ఒక సింగర్ కు మన నాటు నాటు సాంగ్ అంటే యమా ఇష్టమట. జంగ్ కూక్‌ బీటీఎస్ లో ఒక సభ్యుడు. అతనికి మన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ చాలా నచ్చిందట.

తాజాగా నాటు నాటు పాటకు జంగ్ కూక్‌ స్టెప్స్‌ వేయడంతో పాటు ఆ పాటను ఆలపించాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో ఇప్పుడు జంగ్ కూక్‌ నాటు నాటు పాట పాడటం వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న జంగ్ కూక్‌  మన సాంగ్ పాడటం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీ లవర్స్.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచం మొత్తం ఊపేస్తోంది ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవర్సులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సాంగ్ ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. నాటునాటుకు ఆస్కార్ రావాలనిఇండియన్స్ అంతా కోరుకుంటున్నారు. అవార్డుల ప్రదానోత్సవం వేడుకలో ఆర్ఆర్ ఆర్ చిత్ర యూనిట్ పాల్గొననుంది. ఈనెల 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానవోత్సవం జరగనుంది.



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button