News

Brs Sarpanch Hulchul,మందుబాబు కోసం ఎస్సై మీద చేయి చేసుకున్న సర్పంచ్.. నడిరోడ్డుపై నానా హంగామా – sarpanch attack on police for a drunken man who caught in drunk and drive in nizamabad


పీకలదాకా తాగిన ఓ మందుబాబు కోసం ఓ సర్పంచ్ నానా రచ్చ చేశాడు. స్పీకర్‌ను లైన్‌లోకి తీసుకున్నా.. మాట్లాడవా అంటూ పోలీసుల మీదే చేయి చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో రాత్రిపూట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగి భార్యతో కలిసి బైక్ మీద స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 360 శాతం ఆల్కహాల్ ఉన్నట్టు మిషన్‌లో వచ్చింది.

అయితే.. అదే సమయంలో కోటగిరి మండలం సుద్దుల గ్రామ సర్పంచ్ సాయిలు అటువైపు వెళుతుండగా.. ఇది గమనించాడు. మద్యం తాగిన యువకుడిని విడిచి పెట్టాలని పోలీసులకు సదరు సర్పంచ్ హుకుం జారీ చేశాడు. యువకుడు మద్యం అధికంగా తాగి డ్రైవింగ్ చేస్తున్నాడని.. చట్టప్రకారం జరిమానా వేయాల్సిందేనని పోలీసులు సర్పంచుకు వివరించారు. అయినా కూడా వినకుండా తాను సర్పంచునంటూ పోలీసుల మీదికి గొడవకు దిగాడు. ఇలా చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్ద రచ్చగా మారింది. మధ్యలో సర్పంచ్.. స్పీకర్‌కు ఫోన్ చేస్తా మాట్లాడాలంటూ ఎస్సైకి చెప్పగా.. ఎవ్వరు చెప్పినా తన డ్యూటీ తాము చేస్తామంటూ తెగేసి చెప్పటంతో.. సర్పంచ్ ఈగో హర్ట్ అయ్యింది. దీంతో… స్పీకర్‌ ఫోన్ కొట్టినా మాట్లాడవా అంటూ ఎస్సై మీదే చేయి చేసుకున్నాడు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్‌ను కూడా తోసేస్తూ నానా హంగామా చేశాడు.

మరోవైపు.. మద్యం తాగిన వ్యక్తి రోడ్డుపై పడుకొని హల్చల్ చేశాడు. ఆ తర్వాత సర్పంచ్ ఏకంగా పోలీసుల వాహనం తాళం లాక్కొని నానా హంగామా చేశాడు. ఈ ఘటనతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక.. వాహనదారులంతా గుమిగూడారు. మిగితా పోలీసులు.. ఆ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సర్పంచ్, మందుబాబు చేసిన హంగామాకు సంబంధించిన దృష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కోకాపేట, మోకిలా బూస్టింగ్.. HMDA పరిధిలో మళ్లీ భూముల వేలం
‘బావా కలవాలని ఉంది’ అని ప్రేయసి నుంచి మెస్సేజ్.. నమ్మి వెళ్తే ఇంత మోసమా..?

Related Articles

Back to top button