News

bride father death, కూతురు వివాహమైన కాసేపటికే మండపంలోనే కుప్పకూలి తండ్రి మృతి – bride father collapsed and dies in mandap minutes after wedding complete in godavarikhani


వివాహ క్రతువు ముగిసిన కాసేపటికే వధువు తండ్రి పెళ్లి మండపంలో.. కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. అప్పటిదాకా కళకళలాడిన పెళ్లి మండపం మూగబోయింది. బంధువులు, స్నేహితులు విషాదంలో కూరుకుపోయారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. గోదావరిఖనిలోని విఠల్‌ నగర్‌కు చెందిన ఎలిగేటి శంకర్‌ (55)కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు వివాహాన్ని బుధవారం (మే 24) స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిపించాడు.

పెళ్లి క్రతువు ముగిసిన తర్వాత శంకర్.. మండపం అంతా కలియ తిరుగుతూ బంధువులు, స్నేహితులను పలుకరించారు. ఆ తర్వాత కాస్త అలసటగా ఉందంటూ మండపంల సమీపంలో ఓ కుర్చీలో కూర్చున్నారు. కాసేపటికే కూర్చున్న కుర్చీలో అలాగే వాలిపోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆయణ్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

కుమార్తె వివాహాన్ని కళ్లారా చూశారు. గుండె భారాన్ని కాస్త దించుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. శంకర్‌ మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. నవ వధువు, భార్య, కుమారుడి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. పెళ్లి వేడుక కాస్తా విషాదంగా మారింది.

శంకర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెబుతున్నారు. ఆ కారణంగానే మృతి చెంది ఉంటాడని చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఉంటారని భావిస్తున్నారు.

పాపను సెల్లార్‌లో నిద్రపుచ్చి పనిచేస్తున్న మహిళా కూలీ.. కారు వచ్చి ఎక్కించడంతో ఘోరం
బిగ్గెస్ట్ సైబర్ ఫ్రాడ్: లేడీ డాక్టర్ నుంచి 4.5 కోట్లు ఫట్.. వీడియో కాల్ చేసి దారుణం!

Related Articles

Back to top button