Heartbreak Insurance Fund: ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం. కొందరు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. ఇంకొందరు కొన్నాళ్ల స్నేహం తర్వాత ప్రేమలో పడతారు. అయితే, ప్రేమలో పడడం ఓకే.. ఇటీవలి కాలంలో అదే స్థాయిలో బ్రేకప్‌లు ఈజీగా జరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే మనసు ఇచ్చిన వ్యక్తిని కాదని మరో వ్యక్తితో రిలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు యువత. ప్రధానంగా ప్రేమికుల మధ్యలోకి ఎవరైనా కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎక్కువగా విడిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇలా ప్రేమ విఫలమైనప్పుడు చాలా మంది మానసికంగా ఒత్తడికి గురవుతుంటారు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వదిలి వెళ్లడాన్ని తట్టుకోలేరు. అయితే, ప్రస్తుతం ఓ ఐడియా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి చేతిలో మోసపోయిన ఓ యువకుడికి ఇన్సూరెన్స్ (breakup insurance policy) ద్వారా రూ.25 వేలు వచ్చాయి. హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది ఇప్పుడు తెగ వైరల్‌గా మారుతోంది. ఆ సంగతేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చూశాం కానీ, ఈ లవ్ బ్రేకప్ ఇన్సూరెన్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారూ? అవునండీ అది నిజమేనటా.. ప్రేమలో పడిన ఓ జంట హార్ట్‌బ్రేకప్ ఇన్సూరెన్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంది. దీని ద్వారానే ఆ యువకుడుకి రూ.25 వేలు అందాయి. ట్విట్టర్ యూజర్ ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. తన, తన మాజీ ప్రేమికురాలు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్‌ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రేమ విఫలమైతే ఒకే వ్యక్తి ఎక్కువ బాధపడకూడదనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పాడు. ప్రతి నెల ఇరువురు రూ.500 చొప్పున ఇందులో జమ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ఎవరైతో ప్రేమను కాదని వెళ్లిపోతారో వారు వట్టి చేతులో వెళ్లాలి. మోసపోయిన వ్యక్తి అందులోని డబ్బులను తీసుకోవాలి.
రెండేళ్లు వీరు ఇరువురు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ప్రతీక్ ఆర్యాన్‌ను అతడి గర్ల్‌ఫ్రెండ్ మోసం చేసి వెళ్లిపోయింది. దీంతో హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్‌లోని రూ.25 వేలు ఆర్యన్‌కు వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్లో రాసుకొచ్చాడు భగ్న ప్రేమికుడు ఆర్యన్. ‘ నా గర్ల్‌ఫ్రెండ్ చీటింగి చేసినందుకు నాకు రూ.25 వేలు వచ్చాయి. మేము రిలేషన్‌షిప్ ప్రారంభించిన తొలినాళ్లలో జాయింట్ అకౌంట్ తెరిచి అందులో నెల నెలా ఇరువురు తలో రూ.500 జమ చేస్తూ వచ్చాయి. ఈ ప్రేమలో ఎవరైతే మోసపోతారో వారికే ఈ డబ్బులు మొత్తం దక్కాలని ఒప్పందం చేసుకున్నాం. అదే హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్.’ అని పేర్కొన్నారు ఆర్యన్.
ప్రతీక్ ఆర్యన్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 8 లక్షల మందికిపైగా వీక్షించారు. వందల మంది కామెంట్లు చేశారు. అయితే, చాలా మంది ఈ స్టోరీ నిజమేనా అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ అనేది జీవితాన్ని ఏ విధంగా బెటర్ చేస్తుందో దానికి ఇదే సరైన ఉదాహరణ అంటూ ఓ యూజర్ పేర్కొన్నారు. ప్రేమ అనేది ఒక రీఫండ్ పాలసీ నుంచి రాదని ఎవరు చెప్పారు అని మరొకరు రాసుకొచ్చారు. గొప్ప ఐడియా అంటూ కొందరు పొగుడుతుంటే మరికొందరు లవ్‌పై కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ ఉంటుందా? (heartbreak insurance fund is real or fake) అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
- Read Latest Business News and Telugu News
DICGC: బ్యాంక్ దివాలా తీస్తే దాచుకున్న డబ్బులు వస్తాయా? RBI ఏం చెబుతోంది?
మీ తల్లిదండ్రులకు మానసిక, ఆర్థిక మద్దతు ఇవ్వడం ఎలాగో తెలుసుకోండి..
Hyderabad Hitech City లో బోర్డు తిప్పేసిన IT కంపెనీ.. ఉద్యోగాల పేరిట భారీ మోసం.. ఎలా నమ్మించారో తెలుసా?