Brahmamudi Today Episode,Brahmamudi: బందీగా స్వప్న.. బాధల్లో కావ్య! అనామిక దెబ్బకు అప్పూ బలి! అభిమానుల్లో ఉత్కంఠ – brahmamudi serial upcoming episode highlights
పని మనిషిని అడ్డం పెట్టుకుని అంత రచ్చ జరిగేలా చేసిన రుద్రాణికి.. మతిపోయింది అంతే. ‘రాత్రికి రాత్రి ఏం జరిగిందో అర్థం కాక.. నివ్వెరపోయిన రుద్రాణి.. అలా చూస్తూ ఉండే ప్రోమో గత ఎపిసోడ్ చివరిలో చూశాం. అందులో అపర్ణ దేవి.. ఎప్పటిలానే కోడలు కావ్యని పిలవడం.. మాట్లాడటం.. సీతారామయ్య, ఇందిరా దేవి, భాగ్యలక్ష్మీ వాళ్లకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో ఏమోనన్న ఆసక్తిని నిరాశపరచింది హాట్ స్టార్. మరోవైపు అనామికకు ప్రపోజ్ చేయాలని కళ్యాణ్ సిద్ధం అయపోయాడు. ఈ క్రమంలోనే అప్పూలో ఇక నుంచి విరహవేదన మొదలు కాబోతున్నట్లే. అలాగే స్వప్నకు ఏం ప్రమాదం జరగబోతుంది? అనే అంశం కూడా రసవత్తరంగానే మారింది. అందుకే అభిమానులు రాత్రి టీవీలో చూడటానికంటే ముందు హాట్ స్టార్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ నేడు బ్రహ్మముడి అభిమానులకు నిరాశే ఎదురైంది. చూడాలి మరి అప్ డేట్స్ ఎప్పుడు అందుతాయో.