brahmamudi: అప్పూ కొంప ముంచిన కావ్య.. కవి గుండెల్లో కొత్త ఉరకలు.. ప్రేమ రాయబారాలు మొదలు – kavya grows suspicious and asks kalyan about love in brahmamudi serial today
అప్పూ ఫోన్ లిఫ్ట్ చేసి.. ఏందిరా బయ్.. చెప్పు అంటుంది. ఏంది ఏంటీ బ్రో? నా తలకు దెబ్బ తగిలింది. ఎలా ఉందని అడిగావా నువ్వు ఫోన్ చేసి? అంటాడు కళ్యాణ్ అలిగినట్లు ముఖం పెట్టి. ‘నీకేమైనా తల పగిలి.. ఆపరేషన్ జరిగి.. ఐసీయూలో ఉన్నావా ఏందీ? అయ్యిందే చిన్న గాయం.. మళ్లీ దానికి నేను ఫోన్ చేసి అడగాల్నా? అంటుంది అప్పు గుర్రుగా. ‘నీ నుంచి ఇవన్నీ ఊహించుకోవడం నా తప్పేలే’ అంటాడు కళ్యాణ్ నిరాశగా. ‘తెలిసింది కదా.. ఫోన్ పెట్టెయ్’ అంటుంది అప్పూ విసుగ్గా. ‘హా.. బ్రో బ్రో.. నీతో ఒక విషయం మాట్లాడాలి.. ఇలా ఫోన్‌లో కాదు.. కలిసి మాట్లాడుకుందాం’ అంటాడు కళ్యాణ్. అంత ముఖ్యమైన పనేందీ? అంటుంది అప్పు. ‘చెప్పా కదా.. చాలా ముఖ్యమైన పని అని.. ఫోన్‌లో చెప్పేది కాదు’ అంటాడు కళ్యాణ్. సరే వస్తాను గంట ఆగి స్టార్ట్ అవ్వు.. ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి. అవి కాగానే బయలుదేరతాను అంటుంది అప్పు. సరే థాంక్యూ బ్రో.. త్వరగా వచ్చెయ్ అని ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్.
‘ఈ రోజు ఎలాగైనా మంచి ప్లాన్ చేసి.. అనామికకు నా ప్రేమ విషయం చెప్పెయ్యాలి’ అని మనసులో కళ్యాణ్ ఫిక్స్ అవుతాడు సంబరపడిపోతూ. మరి అప్పూ బ్రోలో మొదలైన ప్రేమ సంగతేంటీ? ఆ విషయం అప్పూ ఎప్పుడు తెలుసుకుంటుంది? కళ్యాణ్‌కి ఎప్పుడు చెబుతుంది? ఆ బ్రహ్మముడి ఎప్పుడు పడుతుంది? లాంటివన్నీ ఆసక్తిగా ఉన్నాయి. మొత్తానికీ కావ్యకు తెలియకుండానే కళ్యాణ్‌లో ధైర్యం నింపి.. అప్పుకి అన్యాయం చేసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.