News

Bombay Dyeing,Real Estate: ఎకరం రూ.236 కోట్లు.. రికార్డులన్నీ బద్దలు.. 22 ఎకరాల కోసం రూ.5200 కోట్లతో డీల్! – bombay dyeing to sell worli land to goisu realty for ₹5,200 crore


Mumbai: రియల్ ఎస్టేట్‌ రెక్కలు తొడుగుతోంది. దావానలంలా విస్తరిస్తోంది. కరోనా సమయంలో భారీగా ప్రభావితమైన వాటిల్లో రియల్ ఎస్టేట్ ముందు వరుసలో ఉంటుంది. అంతా నగరాల్ని వదిలి సొంతూళ్లకు వెళ్లగా.. రియల్ ఎస్టేట్ రంగం బోసిపోయింది. అయితే మెల్లమెల్లగా 2022లో కోలుకొని.. ఇప్పుడు ఈ సంవత్సరం అందనంత ఎత్తుకు చేరింది. రికార్డు స్థాయిలో జరుగుతున్న డీల్స్ దీనికి నిదర్శనం. ఇప్పుడు దేశంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో పలు రియల్ ఎస్టేట్ సంస్థల రిపోర్ట్స్‌ను బట్టి హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇక్కడ బెంగళూరు, దిల్లీ, చెన్నైలను మించి ధరలు ఉంటున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ ఔటర్ పరిధిలోని కోకాపేట్‌లో ఎకరం భూమి రూ.100 కోట్లకుపైనే పలికింది.

ఇదే దేశంలో అతిపెద్ద డీల్‌ అని అభిప్రాయపడ్డారు రియల్ ఎస్టేట్ నిపుణులు. దీంతో హైదరాబాద్ రేంజ్ కూడా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా కోకాపేట్ గురించి చర్చ నడిచింది. అయితే ఇప్పుడు అంతకుమించి డీల్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ముంబయిలోని వాడియా గ్రూప్‌కు చెందిన బాంబే డైయింగ్ అండ్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (BDMC) బుధవారం ఈ డీల్ గురించి కీలక ప్రకటన చేసింది. వొర్లిలో ఉన్న తమ 22 ఎకరాల భూమిని జపాన్‌కు చెందిన సుమిటోమో రియాల్టీ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌కు విక్రయించేందుకు అంగీకరించింది. ఇక దీని విలువ ఏకంగా రూ.5200 కోట్లు కావడం విశేషం. అంటే ఒక్కో ఎకరానికి రూ.236 కోట్లకుపైగా పడుతుంది. ముంబయిలో ఇది అతిపెద్ద ల్యాండ్ డీల్ అని తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే.. దేశంలోనే ఇదే అతిపెద్ద డీల్ అని నిపుణులు అంటున్నారు.

  • PM Kisan: పీఎం కిసాన్ స్కీంకు 81 వేల మంది రైతులు అనర్హులు.. మరి మీరు అర్హులా కాదా? చెక్ చేసుకోండి..

  • Byjus: అయ్యో ఎంత పనైపోయింది.. వేల కోట్ల అప్పు తీర్చేందుకు బైజూస్ కిల్లర్ ప్లాన్.. అన్నీ అమ్మేస్తుందిగా!

ఈ మేరకు బాంబే డైయింగ్ కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం అందించింది. రెండు దశల్లో దీనిని విక్రయించే ప్రతిపాదనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు బుధవారం ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. మొత్తం విలువ రూ.5200 కోట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పింది. ఇందులో తొలి దశలో భాగంగా రూ.4675 కోట్లు, రెండో దశలో భాగంగా రూ. 525 కోట్లు వస్తాయని పేర్కొంది.

భవిష్యత్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం కోసం కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడం కోసం ఈ విక్రయం జరుగుతుందని తెలిపింది బాంబే డైయింగ్ కంపెనీ. ఈ డీల్‌పై వాడియా గ్రూప్ ఛైర్మన్ నూసిల్ వాడియా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ డీల్ ప్రకటన నేపథ్యంలో బాంబే డైయింగ్ కంపెనీ షేరు బుధవారం సెషన్‌లో దూసుకెళ్లింది. ఏకంగా 6.93 శాతం పెరిగి రూ.140.50 వద్ద స్థిరపడింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ చూస్తే రూ.2.90 ట్రిలియన్ కోట్లుగా ఉంది.

Schemes for Women: ఈ మహిళలకు వడ్డీ లేకుండా రూ. 3 లక్షల లోన్.. ఎలా అప్లై చేయాలి? ఫుల్ డీటెయిల్స్ ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో ఈ ఏరియాలోనే అద్దెలెక్కువ.. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలిలో రెంట్లు ఇలా..

Read Latest Business News and Telugu News

Advertisement

Related Articles

Back to top button