ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఐతే ముందస్తుగా ఎటువంటి ప్రకటన వెలువడకుండా అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసిన తారామణులు వీరే..
Mar 07, 2023 | 6:56 AM
ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఐతే ముందస్తుగా ఎటువంటి ప్రకటన వెలువడకుండా అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసిన తారామణులు వీరే..
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్‌ను ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లైన నెల రోజుల తర్వాత పెళ్లి విషయాన్ని ప్రకటించింది ఈ భామ.
బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ కమెడియన్ కుమార్ వరుణ్‌ను ఫిబ్రవరి 23న పెళ్లాడింది. పెళ్లి వార్తలు ఎక్కడా బయటికి రాకుండా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది ఈ జంట.
బాలీవుడ్ నటి చిత్రాశి రావత్, నటుడు ధృవాదిత్య భగ్వనానీని ఫిబ్రవరి 4న పెళ్లాడింది. ఈ బ్యూటీ కూడా రహస్యంగా పెళ్లిపీటలెక్కింది.
బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ, నటుడు రిబ్బు మెహ్రాను ఫిబ్రవరి 25న గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది.