Vidya balan: విద్యా వాటీజ్ దిస్.? ‘డర్టీ పిక్చర్’ అంటూ నెటిజన్స్ మండిపాటు.
విద్యా బాలన్.. ఇండియన్ సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన నటన, అందంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ బ్యూటీ. 2011లో వచ్చి డర్టీ పిక్చర్‌తో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో అలనాటి..
విద్యా బాలన్.. ఇండియన్ సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన నటన, అందంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ బ్యూటీ. 2011లో వచ్చి డర్టీ పిక్చర్‌తో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిన్నది తన నటన, బోల్డ్ సీన్స్‌తో సంచలనం రేపింది. ఇదిలా ఉంటే 2012లో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను వివాహమాడిన ఈ చిన్నది ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ వస్తోంది.
తెలుగులో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ వివాహం తర్వాత బోల్డ్ సీన్స్‌లో నటించడం తగ్గించింది. ఇక బయట కూడా నిత్యం చీర కట్టులోనే కనిపిస్తూ వచ్చింది. అయితే తాజాగా విద్యా బాలన్‌కు సంబంధించిన ఫొటో షూట్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. బోల్డ్ లుక్‌లో కనిపించి ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసిందీ బ్యూటీ. న్యూస్ పేపర్‌ను అడ్డుగా పెట్టుకొని చేతిలో కాఫీ కప్, కళ్లకు బ్లాక్ షేడ్స్‌తో మెస్మరైజ్ లుక్‌లో సందడి చేసిందీ బ్యూటీ. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫ్ డబ్బూ రత్నానీ రూపొందిచిన ఫొటో షూట్‌లో విద్యా ఇలా బోల్డ్ లుక్‌లో కనిపించి అవాక్కయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే ఈ ఫొటోకు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరు బోల్డ్ బ్యూటీ అంటూ పొగడ్తలు కురిపిస్తుంటే, మరికొందరు డర్టీ పిక్చర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కేవలం బోల్డ్ లుక్స్‌తోనే కాకుండా బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తోనూ నిత్యం వార్తల్లో నిలవడం విద్యాకు అలవాటు. ఇందులో భాగంగానే తాజాగా తన సినిమా కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది విద్యా.. ‘నా కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతుంటాయి. కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ వైవిధ్యమైన చిత్రాల్లో నటించడమే ఇందుకు కారణం. అయితే నేను ఏ తరహా సినిమాలు చేస్తూ కొనసాగాలి అనే స్పష్టత ఇప్పటికీ నాకు లేదు. మనసుకు నచ్చిన కథలు ఎంచుకుంటూ వెళ్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి