Entertainment

Richa Chadda Controversy: వివాదంలో చిక్కుకున్న ఆ బాలివుడ్ నటి.. అర్మీని అవమానపరిచేలా ట్వీట్ చేసిందంటూ..


Richa Chadda

బాలివుడ్ నటి రిచా చద్దా సరి కొత్త వివాదానికి కారణమయ్యారు. బుధవారం ట్విట్టర్ వేదికగా దిచా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వివాదంగా మారింది. విషయం ఏమిటంటే.. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటనకు రిచా స్పందించారు. దాంతో ట్విట్టర్‌లో చాలా మంది ఆమెపై ఆగ్రహిస్తున్నారు. ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంద’ని ద్వివేదీ మీడియాకు ఇచ్చిన ప్రకటనలో మాట్లాడారు. దానిని ట్విట్టర్ యూజర్లలోని ఒకరు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు రిచా ‘గాల్వాన్ సే హాయ్’ అని రిట్వీట్ రిప్లై ఇచ్చారు. అంతటితో ట్విట్లర్ యూజర్లు ఆమెపై మండిపడుతున్నారు.

రిచా చద్దా వివాదాస్పద ట్వీట్..

లెఫ్టినెంట్ జనరల్ చేసినప్రకటనను షేర్ చేస్తూ ‘గాల్వాన్ సే హాయ్చె’ అని రిచా ట్వీట్‌ చేశారు.  ఆమె ఆ విధంగా గాల్వాన్ సంఘటన గురించి మాట్లాడటం ద్వారా సైన్యాన్ని అవమానించిందని నెటిజన్లు ఆమెను దూయబట్టారు. రిచా తన ట్వీట్‌కి సిగ్గుపడాలని బీజేపీ నేత మజిందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు. “ఇది చాలా అవమానకరమైన ట్వీట్. వీలైనంత త్వరగా దీనిని ఉపసంహరించుకోవాలి. భారత సాయుధ బలగాలను ఇలా అవమానించడం తగదు” అని ఆయన ట్వీట్ చేశారు.

రిచా చద్దా ట్వీట్‌తో అంతా గందరగోళంగా..

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే భారత సైన్యానికి ప్రథమ లక్ష్యమని గతంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ షిండే  ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ.. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తాజాగా ఓ ప్రకటన చేశారు . జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌లలో మా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించామని.. గిల్గిట్, బాల్టిస్తాన్  చేరుకున్నప్పుడు మేము మా లక్ష్యాన్ని సాధించగలుగుతామని ఆయన తెలిపారు. రక్షణ మంత్రి ప్రకటనకు తన మాటలను జోడిస్తూ, ద్వివేది మంగళవారం.. “భారత సైన్యానికి సంబంధించినంత వరకు, కేంద్ర ప్రభుత్వమిచ్చే ఏ ఉత్తర్వునైనా అమలుపరుస్తుంది. అటువంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు, మేము ఎల్లప్పుడూ వాటి కోసం సిద్ధంగా ఉంటాము” అని అన్నారు. ‘‘ఉభయ దేశాల ప్రయోజనాల కోసం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయకుండా చూసుకోవడానికి సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా అది విచ్ఛిన్నమైతే, మేము వారికి తగిన సమాధానం ఇస్తాము’’ అని కూడా ఆయన తెలిపారు.

కాగా, రిచా చేసిన వివాదాస్పద ట్వీట్‌తో బాలీవుడ్‌పై స్లీపింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు మళ్లీ తలెత్తాయి. #బయ్‌కాట్‌బాలీవుడ్ అంటూ మళ్లీ ట్రెండ్ చేయడం ప్రారంభించారు. 

Related Articles

Back to top button