Entertainment

OG Movie: పవన్ సినిమాపై బాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్.. ‘OG’ సినిమా అలా ఉంటుందట..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో ‘ఓజీ’ ఒకటి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నాని’s గ్యాంగ్ లీడర్ సినిమా ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను ముంబై నేపథ్యంతో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా ఇందులో కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటి నెలకొంది.

ఇప్పటివరకు దాదాపు 60 శాతం వరకు ఈ సినిమా టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మీ నటిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన షెడ్యూల్లో ఆయన జాయిన్ అయ్యారు. పవన్, ఇమ్రాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలెట్ ఉంటాయని ముందు నుంచి వినిపిస్తోన్న టాక్. దీంతో ఈ సినిమా చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే తాజాగా హీరో ఇమ్రాన్ హాస్మీ ఓజీ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఓజీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమా కూల్ గా సాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Related Articles

Back to top button