Entertainment

Balakrishna: బాలయ్య సినిమాలో మరో బాలీవుడ్ స్టార్.. పవర్‏ఫుల్ విలన్‏గా ఎవరంటే..


డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం

నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు వెండితెరపై.. మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అకండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో స్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఆహా ఓటీటీలో అన్‏స్టాపబుల్ టాక్ షోతో యాంకరింగ్‏లో కొత్తదనం తీసుకువచ్చారు. ఎప్పుడూ యాక్షన్ చిత్రాలతో ఆడియన్స్ ను అలరించిన బాలయ్య.. తనదైన కామెడీ టైమింగ్‏తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న బాలయ్య సినిమాతో ఓ బాలీవుడ్ స్టార్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారట.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం.. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ తో చర్చలు జరిపారట. ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీ కూడా అంగీకరించినట్లుగా సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి



ఇక ఈ సినిమాలోనే కాకుండా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు చిత్రంలోని బాబీ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడట. అయితే ముందు ఈ మూవీలో బీటౌన్ నటుడు అర్జున్ రాంపాల్ నటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో అతని స్థానంలో బాబీ దేఓల్ ఎంపికైనట్లు సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button