News

Bolivian Man: సరదాకోసం అడవికి వేటకు వెళ్లి.. నెలరోజుల పాటు మూత్రం తాగి, కీటకాలను తింటూ బతికిన యువకుడు.. చివరకు..


Bolivian Man

ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి అడవిలో పురుగులను తిని మూత్రం తాగుతూ బతకాల్సి వచ్చింది. బొలీవియాకు చెందిన ఓ వ్యక్తి తాను అమెజాన్ అడవుల్లో ఒక నెలపాటు చిక్కుకుపోయాడు. అక్కడ తనకు తినడానికి ఆహారం, తాగడానికి పానీయాలు లేకుండా  పోయానని పేర్కొన్నాడు. దట్టమైన అమెజాన్ అడవుల నుంచి బయటపడడానికి మార్గం దొరకక నెల రోజుల పాటు తిరిగాడు. చివరికి రెస్క్యూ టీమ్ కంటబడి.. రక్షించబడ్డాడు. తిరిగి మానవజీవితంలో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తన కష్టాలను వివరించాడు.. అది వింటే.. ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం.

ఒక వార్తా నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల జొనాటన్ అకోస్టా తన స్నేహితులతో కలిసి జనవరి 25న ఉత్తర బొలీవియాలో వేట కోసం విహార యాత్రకు వెళ్ళాడు. అనుకోకుండా  తన స్నేహితుల నుండి విడిపోయిన అకోస్టా అడవిలో తప్పిపోయాడు. తమ స్నేహితుడి కోసం స్నేహితులు వెదికారు. చివరకు అడవుల్లో అకోస్టా రెస్క్యూ టీమ్ కు చిక్కాడు. ఈ నెల రోజులు తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నానో అకోస్టా వివరించాడు. అడవిలో తనను తాను ఎలా బ్రతికించుకున్నాడో.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పాడు.

కీటకాలు తిన్నాడు, మూత్రం తాగాడు
అమెజాన్ దట్టమైన అడవుల్లో కీటకాలను తింటూ బతకాల్సి వచ్చిందని అకోస్టా తెలిపారు. ఆహారంగా బొప్పాయి వంటి కొన్ని అడవి పండ్లను తినేవాడినని చెప్పాడు. అంతేకాదు తాను వర్షం కోసం దేవుడిని ప్రార్థించాను.  వర్షం పడకపోతే తాను చనిపోతాన” అని భావించినట్లు చెప్పాడు. తనను తాను హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తన రబ్బరు బూట్లలో వర్షపు నీటిని సేకరించానని అకోస్టా చెప్పాడు. వర్షాలు తగ్గి.. ఎండలు మండిపోతుంటే.. బలవంతంగా మూత్రం తాగి బతికినట్లు పేర్కొన్నాడు.

ప్రాణాంతకమైన అడవి జంతువుల మధ్య
అడవిలో చిరుత పులలతో సహా ప్రాణాంతక వన్యప్రాణులు ఎదురవ్వడంతో భయపడ్డాను. అంతేకాదు వాటిని ఎలా ఎదుర్కొన్నాడో కూడా చెప్పాడు. విశేషమేమిటంటే.. 31 రోజుల తర్వాత తనకు 300 మీటర్ల దూరంలో ఉన్న రెస్క్యూ టీమ్‌ని చూసి సాయం కోసం కేకలు వేస్తూ వారి వైపు వెళ్లాడు. రెస్క్యూ టీమ్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు, వారు ఎట్టకేలకు అకోస్టాను అడవుల్లో నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో.. అకోస్టా బరువు 17 కిలోలు మేర తగ్గాడు. డీహైడ్రేట్ అయ్యాడు. రెస్క్యూ టీమ్ రక్షించిన తర్వాత, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. అక్కడ అతని గడ్డం, జుట్టును కత్తిరించారు. ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు వేటకు అడవికి వెళ్లనని.. ఇక నుంచి భక్తిగీతాలు వింటూ కాలక్షేపం చేస్తానని శపథం చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Related Articles

Back to top button