Blue Lakes: అద్దం కంటే పారదర్శకమైన నీరు.. భూమి మీద ఉన్న అత్యద్భుతమైన బ్లూ లేక్స్ ఇవే.. చూశారంటే ఆశ్చర్యపడాల్సిందే.. – Telugu News | The Most Crystal Clear Lakes in the World, check for full list
ఈ భూ ప్రపంచం జీవరాశులకు మాత్రమే కాక నమ్మశక్యం కాని ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలకు కూడా నిలయం. ముఖ్యంగా అందమైన జలపాతాలు, అలరించే అడవులు, అపూర్వమైన దృశ్యాలు ఇంకా ఎన్నోన్నో ప్రకృతి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని చూస్తే మనసుకు సంతోషం కలగడమే కాక ఎక్కడా లేనంతగా ప్రశాంతత లభిస్తుంది.
May 19, 2023 | 6:10 AM
అలాంటి అద్భుత దృశ్యాలలో బ్లూలేక్స్ కూడా ప్రముఖమైనవి. వీటిలోని నీరు అద్దం కంటే పారదర్శకంగా ఉంటుంది. మరి ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవరించి ఉన్న బ్లూలేక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Crater Lake, Oregon: క్రేటర్ అమెరికాలో ఉన్న అతిపెద్ద సరస్సు ఈ క్రేటర్ సరస్సు. దీని లోతు 1,943 అడుగులు. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీని అందాలను పెంచడానికి ఒరెగాన్ ప్రభుత్వం ఈ లేక్ చుట్టూ ఓ జాతీయ ఉద్యానవనాన్నికూడా సృష్టించింది. ఈ సరస్సులోని నీరు నీలం రంగులో ఉండడం దాని ప్రత్యేక ఆకర్షణ.
Lake Baikal, Russia: రష్యాలోని బైకాల్ సరస్సు రంగు కూడా ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ సరస్సు లోతు ఏకంగా 5,300 అడుగులు. అంతేకాక ఇది 400 మైళ్ల పొడవు కూడా ఉంటుంది ఉంటుంది. ఇంకా ఈ సరస్సులో 27 ద్వీపాలు, 1500 రకాల జీవ జాతులు ఉన్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
Lake Pukaki, New Zealand: పెద్ద పెద్ద పర్వత శ్రేణుల మధ్య ఏర్పడిన ఈ సరస్సు.. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో ఉంది. ఈ సరస్సులోని నీరు కూడా నీలం వర్ణంలోనే కనిపిస్తున్న కారణంగా దాని అందం మరింత ఎక్కువగా ఉంటుంది.
Torch Lake, Michigan: అమెరికా మిచిగాన్‌లోని టార్చ్ లేక్ కూడా 19 మైళ్ల పొడవు ఉంటుంది. ఈ బ్లూలేక్ హౌస్‌బోట్ యాత్రను ఆస్వాదించాలనుకునేవారికి తిరుగులేని గమ్యస్థానం. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి.