birth certificates cancel, జీహెచ్ఎంసీలో భారీగా ‘నకిలీ’ బాగోతం.. 31 వేల బర్త్, డెత్ సర్టిఫికేట్లు రద్దు – greater hyderabad municipal corporation cancels over 31 thousand fake birth and death certificates
2020 మార్చి నుంచి డిసెంబర్ 2022 వరకు నాన్ అవేలెబిలిటీ కింద 27,328 బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారు. 4,126 డెత్ సర్టిఫికేట్స్ జారీ చేశారు. ఇందులో అత్యధికంగా మెహదిపట్నం సర్కిల్‌లో 5877, చార్మినార్ సర్కిల్‌లో 3949, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 2821, సికింద్రాబాద్ సర్కిల్‌లో 1758 బర్త్ సర్టిఫికేట్స్ జారీ చేశారు. డెత్ సర్టిఫికేట్స్.. బేగంపేట్ సర్కిల్‌లో అత్యధికంగా 409, గోషామహల్ సర్కిల్‌లో 329, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్ర నగర్, మెహదీపట్నం, కార్వాన్ సర్కిళ్లలో 220 నుంచి 240 సర్టిఫికేట్స్ జారీ చేసినట్టు తేలింది.
నాన్ అవేలెబిలిటీలో సంబంధిత పత్రాలకు బదులు తెల్ల కాగితాలు పెట్టినా కొంతమంది అధికారులు సర్టిఫికేట్స్ జారీ చేయటం గమనార్హం. ఇందులో బర్త్‌కు సంబందించి మొత్తం 10,276.. అలాగే డెత్‌కు సంబంధించి 1218 సర్టిఫికేట్స్ జారి చేసినట్టు తేలింది. ఇలాంటివి బర్త్‌కు సంబంధించి బేగంపేట్ సర్కిల్‌లో అత్యధికంగా 2787, సికింద్రబాద్ పరిధిలో 1702, చార్మినార్ పరిధిలో 1465, మెహదిపట్నం పరిధిలో 1256, ఫలక్ నుమా సర్కిల్‌లో 1146 సర్టిఫికేట్స్ జారీ చేశారు. తెల్ల కాగితాలు పెట్టి నాన్ అవేలబులిటీ కింద డెత్ సర్టిఫికేట్స్ తీసుకున్న సర్కిల్‌లలో 369 తో బేగంపేట్ ఫస్ట్, 159 తోసికింద్రాబాద్ సెకండ్, 124తో గోషామహల్ మూడో ప్లేస్‌లో ఉన్నాయి.
అయితే.. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ లేకుండా బర్త్‌లో 21,745, డెత్‌లో 2824 సర్టిఫికేట్స్ జారీ చేశారు. ఇందులో బర్త్‌కు సంబంధించి మెహదీపట్నంలో 4030, చార్మినార్‌లో 3897, బేగంపేట్‌లో 2787 సర్టిఫికేట్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే డెత్‌కు సంబంధించి బేగంపేట్‌లో 369, గోషషామహల్‌లో 329, రాజేంద్రనగర్‌లో 217 డెత్ సర్టిఫికేట్స్ జారీ చేశారు.
ఇవే కాకుండా ఎలాంటి పత్రాలు జత చేయకుండా డైరెక్టుగా సర్టిఫికేట్స్ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇందులో బర్త్‌కు సంబంధించి మొత్తం 8226, డెత్‌కు సంబంధించి మొత్తం 1386 సర్టిఫికేట్స్ తీసుకున్నారు. బేగంపేట్‌లో 2787, సికింద్రాబాద్‌లో 1702, మెహదీపట్నంలో 1286 ఎలాంటి పత్రాలు లేకుండా బర్త్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. డెత్‌కు సంబంధించి బేగంపేట్‌లో 369 బేగంపేట్‌లో, 205 గోషషామహల్‌లో అత్యధికంగా తీసుకున్నారు.
అలాగే బర్త్ అండ్ డెత్‌కు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ కాకుండా సంబంధం లేని పత్రాలను జత చేసి బర్త్‌లో 6820, డెత్‌లో 906 సర్టిఫికేట్స్ జారీ అయ్యాయి. బర్త్‌కు సంబందించి అత్యదికంగా బేగంపేట్ లో 2787, సికింద్రాబాద్ లో 1702, చార్మినార్ లో 1293 జారీ అయ్యాయి. అలాగే డెత్ కు సంబందించి బేగంపేట్ లో 369, చార్మినార్ లో 181, సికింద్రాబాద్ సర్కిల్ లో 159 సర్టిఫికేట్స్ జారీ అయినట్టు తేలింది.
- Read More Telangana News And Telugu News