News

Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన సీఎం నితీష్‌ కుమార్‌.. సీఎం వ్యాఖ్యలతో బీజేపీ సభ్యుల నిరసన.. | Bihar chief minister Nitish Kumar wins floor test in Bihar Assembly as BJP stages walkout during his address


విశ్వాసపరీక్షపై ఓటింగ్‌ను బీజేపీ బహిష్కరించింది. విశ్వాసపరీక్షపై చర్చ సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. బీజేపీపై నిప్పులు చెరిగారు సీఎం నితీష్‌కుమార్‌.

బీహార్‌ అసెంబ్లీలో బలపరీక్షలో (Bihar Floor Test)నెగ్గారు సీఎం నితీష్‌కుమార్‌. విశ్వాసపరీక్షపై ఓటింగ్‌ను బీజేపీ బహిష్కరించింది. విశ్వాసపరీక్షపై చర్చ సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. బీజేపీపై నిప్పులు చెరిగారు సీఎం నితీష్‌కుమార్‌. బీజేపీలో మంచివాళ్లకు చోటు లేదన్నారు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి వాళ్లే తన మాటలు వినేవారని , కాని ఇప్పటి బీజేపీ నేతలది పనితక్కువ. ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. 2015లో బీజేపీ తన వాళ్లే గెలిచిందన్నారు నితీష్‌. తేజస్విపై బీజేపీ 2017లో అవినీతి ఆరోపణలు చేసిందని , ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.

మీరు పిల్లలు… ఏమి తెలియదంటూ బీజేపీ ఎమ్మెల్యేలపై నితీష్‌ కుమార్ సెటైర్లు సంధించారు. తేజస్విపై 2017లో ఆరోపణలు చేశారు.. ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేద ఆయన ప్రశ్నించారు. బీజేపీలో మంచివాళ్లకు చోటులేదని విమర్శించారు. వాజ్‌పేయి,అద్వానీలే నా మాట వినేవాళ్లు.. ఇప్పటి బీజేపీ నేతలది పనితక్కువ.. ప్రచారం ఎక్కువ అంటూ కామెంట్స్ చేశారు. 2015లో బీజేపీని నేనే గెలిపించానంటూ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి విమర్శలు చేశారు నితీష్‌ కుమార్. అయితే సీఎం నితీష్‌ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button