News

bigg boss telugu, RJ Surya: సూర్య-ఇనయ కొత్త ‘లవ్’ భాష.. సింబల్ అర్థంకాక జుట్టుపీక్కున్న నాగార్జున – bigg boss telugu 6’s latest promo released


Authored by Rajendra Galeti | Samayam Telugu | Updated: 30 Oct 2022, 2:18 pm

Bigg Boss 6 Telugu Today’s Promo: శనివారం ఎలిమినేట్ అయిన సూర్యాని ఈరోజు స్టేజ్‌పై హౌస్‌లోని ఇనయ చూడబోతోంది. అలానే అతనిపై ప్రేమని వ్యక్తీకరిస్తూ ఎమోషనల్ అవుతున్నట్లు ప్రొమో రిలీజైంది.

 

బిగ్‌బాస్ ఈరోజు ప్రొమో

ప్రధానాంశాలు:

  • బిగ్‌బాస్ ఈరోజు ప్రొమో రిలీజ్
  • సూర్యాని స్టేజ్‌పై చూడగానే ఇనయ ఎమోషనల్
  • వారి లవ్ భాషని అర్థం చేసుకోలేకపోయిన నాగ్
  • హౌస్‌మెట్స్‌‌కి కూడా కొత్తగా అనిపించిన సింబల్
బిగ్‌బాస్ సీజన్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 6లో ఆదివారం (ఈరోజు) ప్రొమో రిలీజైంది. ‘లైక్‌, షేర్‌ అండ్ సబ్‌స్క్రైబ్‌’ మూవీ ప్రమోషన్స్‌ కోసం హీరో శోభన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా వస్తున్నారు. అంతేగాకుండా నాగార్జునతో కలిసి ఫరియా ఓ పాటకి హుషారుగా డ్యాన్స్ కూడా చేసింది. ఆ తర్వాత హౌస్‌మెట్స్‌తో ఓ చిన్న ఫన్నీ గేమ్ కూడా ‘లైక్‌, షేర్‌ అండ్ సబ్‌స్క్రైబ్‌’ టీమ్ ఆడింది. ప్రొమోలో అన్నింటికంటే ఎక్కువ ఆసక్తిరేపుతోంది మాత్రం సూర్య- ఇనయ మధ్య లవ్ ట్రాక్.

సూర్యా శనివారం డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయ్యి.. హౌస్ నుంచి వెలుపలికి వచ్చేశాడు. దాంతో ఎపిసోడ్ ముగిసింది. కానీ ఈరోజు నాగార్జునతో కలిసి స్టేజ్‌పై అతను కనిపించబోతున్నాడు. సూర్యాని స్టేజ్‌పై చూసిన ఇనయ అతను ఇచ్చిన గిప్ట్స్‌ని ధరించినట్లు చూపిస్తూ ప్రొమోలో కనిపించింది. దానికి సూర్య వావ్ అంటూ.. కొత్త తరహాలో వాళ్లిద్దరికే అర్థమయ్యేలా ‘ఒక్కసారి రావా’ అనేలా చేతి వేళ్లతో ఓ లవ్ సింబల్‌ని చూపించాడు. దానికి ఇనయ కూడా అదేరీతిలో సింబల్‌ని చూపిస్తుంది. దాంతో నాగార్జున ఏంటో ఇది నాకు తెలియనవి.. కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి అంటూ జుట్టు పీక్కున్నాడు.

సూర్య-ఇనయ మధ్య నడిచిన ఆ లవ్ సింబల్‌ కమ్యూనికేషన్ బహుశా హౌస్‌మెట్స్‌ కూడా చూడలేదేమో. వాళ్లు కూడా ఒకసారి అనుకరిస్తూ కనిపించారు. దాంతో నాగార్జున ‘ఏంటి గీతు చూసుకుంటున్నావ్’ అని ప్రశ్నించాడు. హౌస్‌లో అందరికీ తలలో నాలుకలా ఉన్న గీతుకి కూడా ఆ సింబల్ కొత్త కాబోలు. ఏందో సార్ ఇది మనకి తెలియని కూడా తెలియదు అంటూ గీతు తేలిపోయింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button