bigg boss telugu highlights, RJ Surya Eliminated: బిగ్‌బాస్ నుంచి సూర్యా డైరెక్ట్ ఎలిమినేట్.. వెక్కివెక్కి ఏడ్చిన ఇనయ – nagarjuna telugu bigg boss season 6 october 29 written updates; host nagarjuna akkinen grills galatta geetu
శనివారం ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్‌గా నడిచింది. ఈ వారం చేపల చెరువు టాస్క్ విషయంలో హౌస్‌మెట్స్ ఆటతీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగార్జున ఫస్ట్ నుంచి అందరికీ అక్షింతలు వేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఎప్పుడు గలగల మాట్లాడే గలాట గీతు నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌కి ఎపిసోడ్ ముగిసే వరకు నోరుతెరిస్తే ఒట్టు. అంతలా నాగార్జున ఆమెకి క్లాస్ తీసుకున్నాడు.
ఎపిసోడ్ మొదట్లోనే ఆదిరెడ్డితో చేపల చెరువు టాస్క్ గురించి నాగార్జున మాట్లాడుతున్నప్పుడు.. గలాట గీతు మధ్యలో ఇన్‌వాల్వ్ అయ్యింది. దాంతో నాగార్జున సీరియస్ అయ్యారు. గీతు నీతో నేను మాట్లాడలేదు.. నిన్న అడిగినప్పుడు మాత్రమే మాట్లాడు. ఈ విషయమై ఇప్పటికే నీకు వార్నింగ్ ఇచ్చాను అని హెచ్చరించాడు. సంచాలక్‌గా గీతు వ్యవహరించిన తీరుపై హౌస్‌మెట్స్ మూకుమ్మడిగా వ్యతిరేకించారు. దానిపై ఆమెకి వివరణ ఇచ్చే ఛాన్స్ కూడా నాగార్జున ఇవ్వలేదు.
గలాట గీతు సంచాలక్‌గా చేసిన తప్పునకి నాగార్జున ఆమెకి శిక్ష వేయాలని కెప్టెన్ శ్రీహాన్‌ని ఆదేశించాడు. దాంతో గీతూని కిచెన్‌లోని పాత్రలని క్లీన్ చేయాల్సిందిగా కెప్టెన్ ఆదేశించాడు. కానీ.. తనకి ఓసీడీ ఉందని చెప్పుకొచ్చిన గీతు ఆ పని చేయలేదని చెప్పింది. దాంతో బాత్రూమ్‌లని క్లీన్ చేయమని కెప్టెన్ ఆదేశించగా.. గీతూ అంగీకరించింది. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గీతూ బాత్రూమ్‌లని శుభ్రం చేయనుంది. గీతూని తిట్టే క్రమంలో నాగార్జున సహనం కోల్పోయి నీ గేమ్ బొచ్చులా ఉందని ఆమె వాడే భాషని గుర్తు చేశాడు.
బాలాదిత్య, ఇనయ, పైమా, రాజ్, శ్రీసత్య ఆటతీరుని మెచ్చుకున్న నాగార్జున.. రేవంత్ గేమ్‌ని మెచ్చుకుంటూనే ఓ చురక కూడా వేశాడు. గేమ్ ఆడుతూ కోపంలో మరీ ఉన్మాదిలా మారిపోతున్నావ్ కాస్తా చూసుకో అంటూ.. గలాట గీతుని దెబ్బతగిలేలా తోసేసిన వీడియోని చూపించాడు. ఆ తర్వాత సూర్యాకి కూడా కాసేపు క్లాస్ తీసుకున్నాడు. ఫెమినిస్ట్ అంటూనే ఒక మహిళని నువ్వు వీక్‌గా ఉన్నావంటూ ఎలా అంటావ్? అని అక్షింతలు వేశాడు. పైమా ఓ అథ్లెట్‌గా ఫైట్ చేసిన విషయాన్ని కూడా సూర్యాకి గుర్తు చేశాడు. చివరికి అతనే డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయ్యాడు. చేపల చెరువు టాస్క్‌లో ఒక్కో జంట తమ సహచర కంటెస్టెంట్‌కి మార్క్‌లు ఇవ్వాలని నాగార్జున సూచించగా.. గీతు, ఆదిరెడ్డి జంట తప్ప మిగిలిన అన్ని జంటలూ కనీసం 8-10 మార్కులు ఇచ్చుకుంటూ వెళ్లాయి. ఆదిరెడ్డి-గీతు జంట మాత్రం ఒకరికొకరు 3-5 మార్కులే ఇచ్చుకున్నారు.