Bigg Boss Sivaji: పవరాస్త్ర దక్కించుకున్న శివాజీ.. రెండో కన్ఫార్మ్‌డ్ హౌస్‌మెట్‌గా రికార్డ్ – sivaji wins second pavarastra and confirmed as house mate in bigg boss 7 telugu
ఈ సందర్భంగా ముగ్గురిలో ఎవరూ గట్టిగా అరిచారని అనుకుంటున్నావ్ అంటూ దామినిని అడిగారు నాగార్జున. అయితే దామిని సరిగా ఆన్సర్ చెయ్యలేకపోవడంతో శివాజీని అడిగారు నాగ్. మైక్‌కి బాగా దగ్గరగా ఉండకూడదు.. అలా అని దూరంగా వెళ్లి అరవకూడదు అప్పుడే గెలుస్తారని శివాజీ అన్నాడు. యస్ ఇది కరెక్ట్ ఆ పని నువ్వే సరిగా చేశావ్.. శివాజీ విన్నర్ అంటూ నాగ్ ప్రకటించారు. డెసిమల్స్ స్కేల్‌సో షకీలాకి 9 మార్కులు రాగా, శివాజీకి 11 వచ్చింది. ఇక స్వయం ప్రకటిత నటుడు అమర్ దీప్ ఆవేశంగా సాగదీసి అరవడంతో మార్కులు కాస్త -6 వచ్చాయి. దీంతో మొత్తానికి శివాజీ గెలిచారు.
సెకండ్ హౌస్‌మెట్‌గా
ఇక సంచాలక్ సందీప్ చేతుల మీదుగా రెండో పవరాస్త్రను శివాజీకి ఇప్పించారు నాగార్జున. దీంతో సెకండ్ కన్ఫార్మ్‌డ్ హౌస్‌మెట్‌గా శివాజీ నిలిచాడు. దీంతో శివాజీకి కూడా ఓ వీఐపీ రూమ్ ఇస్తున్నట్లు కింగ్ చెప్పారు. అలానే శివాదీ పెర్ఫామెన్స్‌పై కూడా నాగ్ ప్రశంసలు కురిపించారు. మైండ్ గేమ్‌లో అద్భుతంగా ఆడావంటూ మెచ్చుకున్నారు. ఇక పవరాస్త్ర గెలిచిన శివాజీ దాన్ని తన రెండో కొడుకు రిక్కీకి అంకితమిస్తున్నట్లు చెప్పాడు.
అయితే శివాజీకి కొంచెం క్లాస్ కూడా పీకారు నాగ్. మాటిమాటికి తలుపు తియ్‌రా సామీ నేనెళ్లిపోతాను అనడం ఏంటి అంటూ శివాజీని నాగార్జున ప్రశ్నించారు. అలానే బిగ్‌బాస్‌ను ఎవరూ ప్రశ్నించడానికి లేదని.. ఇది తన హౌస్ అంటూ, తన రూల్స్ మాత్రమే ఉంటాయని నాగ్ గుర్తు చేశారు.
సారీ చెప్పిన శివాజీ
ఇక నాగ్ చెప్పిన మాటలతో శివాజీ కూడా ఏకీభవించాడు. బిగ్‌బాస్‌ను అనే రైట్ తనకి లేదంటూ ఈ సందర్భంగా సారీ చెబుతున్నట్లు శివాజీ అన్నాడు. అలానే ఈసారి మరింత బాగా ఆడతానని, కచ్చితంగా గేమ్ క్విట్ చేయనంటూ మాట ఇచ్చాడు. మొత్తానికి శివాజీని అయితే నాగ్ గట్టిగానే పైకి లేపారు. అయితే దానికి తగ్గట్లుగానే శివాజీ ఆట కూడా ఉందనుకోండి.
- Read latest TV News and Movie Updates